• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కరీంనగర్
  • /Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి

Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి

Jeevan Reddy Slams To Revanth Reddy On Telangana Draught: తెలంగాణలో రేవంత్‌ రెడ్డి నిర్లక్ష్యం కారణంగా కరువు వచ్చిందని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఎత్తిపోస్తే కరువును అధిగమించవచ్చని తెలిపారు. దీనికోసం రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. జగిత్యాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 06, 2026, 06:44 PM IST|Updated: Nov 06, 2026, 06:51 PM IST
joinshare
Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి
Image Credit: Jeevan Reddy Press Meet

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి

Jeevan Reddy: 'రేవంత్ రెడ్డి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో కరువు మాయం': జీవన్‌ రెడ్డి

2

Vijayasai Reddy: పొమ్మనకుండా పొగ పెట్టారు.. వైఎస్ జగన్‌ టార్గెట్ గా విజయసాయి రెడ్డి షాకింగ్ కామెంట్స్..

3

Palle Palleku Seethakka: ములుగులో సీతక్క సరికొత్త కార్యక్రమం.. పల్లె పల్లెకు వెళ్తున్న మంత్రి

4

ECI SIR Fresh Chance: SIRలో మీ ఓటు పోయిందా? ఏపీ, తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్!

5

Cricketer Baned: క్రికెట్‌లో కలకలం.. కొకైన్ తీసుకుని దొరికిపోయిన స్టార్ క్రికెటర్..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jeevan Reddy vs Revanth Reddy: 'రాష్ట్రం కరువుతో తల్లడిల్లుతోంది. విద్యాసంస్థలు మూసివేసి ఆన్‌లైన్‌లో  బోధన చేపట్టే చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కరువును అధిగమించే అవకాశం ఉన్నప్పటికీ సముద్రంలో వృథాగా పోతున్న నీటిని వినియోగించుకోవడం లేదు' అని రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో కరువు సమయంలో తాగు, సాగునీరు అందించేలా కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం మూడేళ్లలో పూర్తయితే మర్మమతులు చేపట్టేందుకు మూడేళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడడం లేదని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి విమర్శించారు.

జగిత్యాలలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్‌ రెడ్డి ఆలోచన ఎత్తిపోతలను, వినియోగించుకునేలా అడ్డుకునేలా ఉన్నది. 750 టీఎంసీ వృథాగా పోయింది. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద దిగువన కాపర్ డ్యాం ఏర్పాటుచేస్తే మేడిగడ్డ మరమ్మత్తులకు ఎలాంటి ఆటంకం కాదు. సీతారామ ప్రాజెక్ట్ ఎత్తి పోస్తే హైదరాబాద్‌కు వస్తాయా? ఇసుక బస్తాలు అడ్డువేసి నీటిని ఎత్తి పోసుకుంటామని మంత్రి తుమ్మల అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు ఒక నియమం.. కన్నెపల్లి పంపుహౌస్‌కు ఒక నియమమా?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు.

'నీళ్ల ఎత్తిపోతకు రూ.100 కోట్లు వ్యయం చేస్తే కరువును అధిగమించవచ్చు. నేల స్వభావాన్ని బట్టి ఆరుతడి పంటలు సాగు చేస్తారు. వరి కన్నా మొక్కజొన్న అధికముగా దిగుబడి వస్తుంది. ఆరుతడి పంటలు సాగు చేయాలని చెబుతున్న ప్రభుత్వం డ్రిప్ సౌకర్యం కల్పించలా వద్దా.. డ్రిప్ సౌకర్యం కోసం ఉద్యానవన శాఖ వద్ద బడ్జెట్ లేదంటారు. రెయిన్ డ్రిప్ ఎకరానికి రూ.30 వేల ఖర్చు వస్తుంది. రైతులకు రాయితీలు ఇవ్వాలి' అని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి వివరించారు.

'రైతు భరోసా జమ అయినట్టు మెసేజ్ వస్తే బ్యాంక్‌కు వెళితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలాగా ఫేక్ అని తేలింది. రేవంత్ రెడ్డి ప్రాణహిత నది జలాలు అడ్డుకోవడానికి వినియోగించే తెలివిలో నీటి వినియోగానికి పది పైసలు వినియోగించి రూ.100 కోట్లు ఖర్చు చేస్తే కరువును అధిగమించవచ్చు' అని సీనియర్‌ నాయకులు జీవన్‌ రెడ్డి పునరుద్ఘాటించారు. దూరదృష్టితో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని తరలించేలా నిర్మాణాలు చేపట్టిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌కు హ్యాట్సాఫ్ అని ప్రకటించారు.

'కరువును అధిగమించేందుకు వృథాగా పోతున్న నీటిని ఎత్తిపోస్తే కరువును అధిగమించవచ్చు. నెల రోజుల్లో కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయితది. నెలకు 30 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకువస్తే ఐదు నెలల కాలానికి 150 టీఎంసీ నీరు అందుబాటులోకి వస్తే తెలంగాణ రాష్ట్రం కరువు నుంచి బయటపడుతుంది' అని కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి సలహా ఇచ్చారు. 'ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.30 వేలు రాయితీ కల్పించాలి. రైతు భరోసా ఫేక్ మెసేజ్‌లు కాకుండా తక్షణమే బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేయాలి. రాయితీపై విత్తనాలు అందించాలి' అని డిమాండ్‌ చేశారు.

'కేసీఆర్‌కు ఎక్కడ పేరు వస్తదోనని రేవంత్ రెడ్డి మూర్ఖపు ఆలోచనతో తెలంగాణను కరువు కోరల్లోకి నెడుతున్నారు. రేవంత్ రెడ్డి ఒకసారి కేంద్ర జల, విద్యుత్ పరిశోధన సంస్థ సమర్పించిన నివేదిక చదువుకోవాలి. లేదంటే ఉత్తమ్ కుమార్‌ను అడిగి తెలుసుకో' అని మాజీ మంత్రి జీవన్‌ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో జగిత్యాల మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత సురేష్, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ తాటిపర్తి విజయలక్ష్మి, పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి, మున్న, నల్ల స్వామి రెడ్డి, వెంకటేశ్వర్ రావు, దేవేందర్ నాయక్, శీలం ప్రవీణ్, గాజుల రాజేందర్, కొయ్యడి మైపాల్, దుర్గయ్య, సర్పంచులు సురేందర్, మహేష్ , నాయకులు రూప గారు, రాదకిషన్, ధర రమేష్, అశోక్, మల్లేశం, గంగాధర్, గంగారెడ్డి,బారి బాయ్, సాయి, వేణు,ప్రణయ్,నక్క జీవన్, గుండ మధు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Karimnagar
BRS
Politics