SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: సైదాబాద్‌లో కిడ్స్ స్కూల్‌లో అగ్నిప్రమాదం.. సామాగ్రి దగ్దం.. వీడియో..

Fire accident in Saidabad: కిడ్స్ స్కూల్ లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ఘటనలో స్కూల్ లోని మొదటి అంతస్తులో మంటలు వ్యాపించాయి.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 16, 2026, 10:05 AM IST | Updated: Sep 16, 2026, 10:10 AM IST
Image Credit: saidabadschoolfiretragedy
Join

Fire accident at monarch kids school in Saidabad: హైదరాబాద్ లో ఇటీవల తరచుగా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా  ఫైర్ సెఫ్టీ సూచనలు పాటించాలని, దానికి అనుగుణంగా చర్యలు తీసుకొవాలని ఫైర్ సిబ్బంది సూచిస్తున్న కూడా కొంత మంది పూర్తిగా నెగ్లెజెన్సీగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో సైఫాబాద్ పరిధిలోని మాదన్నపేట న్యూ రోడ్ శ్రీనగర్ కాలనీలోని మోనార్క్ కిడ్స్ స్కూల్‌లో మంగళవారం రాత్రి  ఒక్కసారిగా స్కూల్ లో మంటలు వ్యాపించాయి. 

 

 

దీంతో చుట్టుపక్కల వారు స్కూల్ సిబ్బందికి, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు.  మంటలు ఎగిసి పడి  మొదటి అంతస్తు వరకు వ్యాపించాయి. సమాచారంలో అందుకొగానే మలక్‌పేట ఫైర్ సిబ్బంది రంగంలొకి దిగారు . కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. 

రాత్రి పూట ప్రమాదం జరగడంతో, పిల్లలు, సిబ్బంది ఎవరు లేకపొవడంతో  ప్రాణనష్టం జరగలేదు. ఈ ఘటనతో చుట్టుపక్కల వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

అగ్ని ప్రమాదంలో కిడ్స్ స్కూల్ కు చెందిన కొంత సామగ్రి మాత్రమే దగ్ధమైంది. ఈ  ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణమని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES