• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Harish Rao: 'రా సిద్దిపేటలో పోటీ చేయ్‌. రేవంత్ రెడ్డికి ఒక నీతి జాతి ఉందా?' హరీశ్‌ రావు

Harish Rao: 'రా సిద్దిపేటలో పోటీ చేయ్‌. రేవంత్ రెడ్డికి ఒక నీతి జాతి ఉందా?' హరీశ్‌ రావు

Harish Rao Challenge To Revanth Reddy: సిద్దిపేటలో ఎవరో ఎందుకు నువ్వే రా అంటూ రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు. ఆంధ్రాలో సంక నాకుతూ కూర్చున్న రేవంత్ రెడ్డి లెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట సభలో రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్‌ రావు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 20, 2026, 15:37 IST|Updated: Nov 20, 2026, 15:40 IST
joinshare
Harish Rao: 'రా సిద్దిపేటలో పోటీ చేయ్‌. రేవంత్ రెడ్డికి ఒక నీతి జాతి ఉందా?' హరీశ్‌ రావు
Image Credit: Harish Rao

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Harish Rao Challenge: '25 ఏళ్లలో రేవంత్ రెడ్డి 5 పార్టీలు మారాడు. కానీ నా జీవితం మొత్తం ఒక్కటే పార్టీ' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. నీకంటూ ఒక్క నీతి జాతి ఉందా? అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ తల్లి గురించి మాట్లాడితే ఒక్క బీజేపీ ముఖ్యమంత్రి దానిని కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. సోనియా గాంధీ బలి దేవత అని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఇప్పుడు వాళ్లకే బాడీ గార్డ్ లాగా పని చేస్తున్నాడు అని మాజీ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.

సిద్దిపేట సభలో రేవంత్‌ రెడ్డి చేసిన ఆరోపణలు, విమర్శలకు శుక్రవారం మాజీ మంత్రి హరీశ్‌ రావు బదులిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ రెడ్డిలో ఒక్క శాడిస్ట్ మనసత్వం కనిపిస్తుంది. ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు అయినా కమీషన్‌ల గురించి చెబుతున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కమీషన్‌ల గురించి చెప్పాడు. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే పట్టపగలు డబ్బు సంచులతో దొరికిన దొంగవి అని కుండబద్దలు కొట్టిండు. ఆంధ్రాకు కోవర్ట్ రేవంత్ రెడ్డి. పరిపాలనను భ్రష్టు పట్టించాడు. 140 సార్లు కేసీఆర్, కేటీఆర్, నా పేరు తీశాడు' అని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు.

'నాడు నేడు రేవంత్ విధానం తెలంగాణకు ద్రోహం చేయడం. ముఖ్యమంత్రి అనే వాడు ఒక్క జిల్లాకు వస్తే పాలసీ చెబుతా. ఏమి చేశారో వివరిస్తారు. నీ ప్రభుత్వం పతనావస్థలో ఉందని చెప్పకనే చెప్పావు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు. 'నా ఎత్తు, కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడాలి అనుకుంటే గాంధీ భవన్‌లో పెట్టుకొని తిట్టుకోవచ్చా కదా కోట్ల రూపాయలు ప్రజాధనం వృథా చేశావు' అని అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో, బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కు అయ్యావని రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.

'నాడు కాంగ్రెస్ హయాంలోనే శ్రీశైలం ప్రాజెక్టుకు పోతిరెడ్డి ద్వారా పొక్క కొట్టారు. నేడు నాగార్జున సాగర్‌కు కాంగ్రెస్‌ ఉన్నప్పుడే పొక్క కొడుతున్నారు. ఆంధ్రాలో సంక నాకుతూ రేవంత్ రెడ్డి కూర్చున్నాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెంపలేసుకొని ముక్కు నేలకు రాయి అని హితవు పలికారు. 'గోదావరి- బనకచర్లకు రేవంత్ పాలనలోనే బీజం పడింది. చంద్రబాబుకు ఏజెంట్‌గా ఉండి తెలంగాణకు అన్యాయం చేస్తున్నావు. ఉద్యమకారులపై రేవంత్‌ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు హరీశ్‌ రావు గుర్తుచేశారు. ఎంత ప్రెస్టేటయినా, తిట్టినా తాము ప్రశ్నిస్తామని.. తాము ఉద్యమకారులం అని స్పష్టం చేశారు. 'అసెంబ్లీ పెడతా అన్నావు కదా పెట్టు. నీ బట్టలు ఊడదీస్తా. నగ్నంగా నిలబెడతా' అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు హెచ్చరించారు. అయితే తమకు మైక్ ఇచ్చి కట్ చేయకు అని విజ్ఞప్తి చేశారు.

'పాలమూరు ప్రాజెక్టులో 10 శాతం పనులు పూర్తి చేస్తే 50 టీఎంసీలు నీరు అందుబాటులోకి వచ్చేది. నీళ్లు ఇవ్వలేదు కానీ క్రాప్ హాలిడే ఇచ్చావు. కుప్పం ప్రజలకు నీళ్లు.. పాలమూరుకి కన్నీళ్లు. మూడు తరాలు పథకాలు కొనసాగించిన అని చెప్పుతున్న నీవు వైఎస్ రాజశేఖర్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డిని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్‌ రావు ప్రశ్నించారు. 'సొంత పైసాలతో మదన్ మోహన్ కాంస్య విగ్రహాన్ని నేను పెట్టించా. మెడికల్ కళాశాలకు అయినా పేరు పెట్టారు' అని తెలిపారు. శంకరమ్మకి ఎమ్మెల్యే సీటు మేము ఇస్తే ఓడించింది కాంగ్రెస్‌ పార్టీ అని గుర్తుచేశారు. గవర్నర్ కోటాలో మూడు ఎమ్మెల్సీలు ఖాళీ ఉండడంతో అందులో ఒకటి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌ రావు డిమాండ్‌ చేశారు.

'బిడ్డ నిన్ను ప్రజలు తొక్కే రోజు దగ్గరలో ఉంది. ఓట్లు రాని ఎట్లా తొక్కతారు చూడు. మీ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రాదు. నీ అరాచకంతో 20 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు స్పష్టం చేశారు. 'సిద్దిపేటలో కలిస్తే మంత్రి పదవి ఇస్తానంటున్నావు కదా? వాళ్లు వీళ్లు ఎందుకు నువ్వే రా నా మీద పోటీకి. నువ్వు నేను పోటీ చేద్దాం. తేల్చుకుందాం. చిల్లర్ గాళ్లని పంపకు' అని రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌ చేశారు. బీఆర్ఎస్ పార్టీలో వెనక వెనక నువ్వు తిరిగావు. జెడ్పీటీసీ టికెట్ అడిగితే నన్ను నువ్వు ద్రోహివి అని కేసీఆర్ ఇవ్వలేదు. నీ మామ జైపాల్ రెడ్డి నిన్ను ఇంటికి రానీయలేదు' అని చరిత్ర గుర్తుచేశారు. 'కరువు సహాయం పక్క రాష్ట్రాలు ఇస్తున్నారు నువ్వు ఒక్క రూపాయ ఇవ్వలేదు. వడ్లు కొంటలేరని రైతులు వాపోతున్నారు. ఇప్పటివరకు అర లక్ష పంట కూడా కొనలేదు' అని వెల్లడించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
BRS
Harish rao
Hyderabad
Telugu News
Telangana News