Giant python enters a home in yadagirigutta residence video viral: ఇటీవల పాములు, కొండ చిలువలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇంట్లో పార్కింగ్ చేసిన కార్లలో, షూస్ లు, గుబురుగా ఉండే చెట్లలో కోబ్రాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో పాములు, కొండ చిలువలతో జాగ్రత్తగాఉండాలని నిపుణులు తరచుగా చెప్తారు. చీకటిగా ఉండే ప్రదేశాలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట కూడా ఇవి ఎక్కువగా ఆవాసం చేస్తాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొండచిలువ కలకలం యాదగిరిపల్లి నుంచి మైలార్‌గూడెం వెళ్లే దారిలో కొండచిలువ ప్రత్యక్షం రాచకొండ చిన్నరాజు ఇంట్లోకి చొరబడిన 9 అడుగుల కొండచిలువ భారీ కొండచిలువను చూసి భయాందోళనకు గురైన కాలనీవాసులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్న స్నేక్ క్యాచర్స్ కొండచిలువను పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్న కాలనీవాసులు
— PulseNewsBreaking (@pulsenewsbreak) October 7, 2026
ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొండచిలువ ప్రత్యక్షమయ్యింది. యాదగిరిపల్లి నుంచి మైలార్‌గూడెం వెళ్లే దారిలో కొండచిలువ కన్పించడంతో అందరు భయంతో వణికిపోయారు. రాచకొండ చిన్నరాజు ఇంట్లోకి 9 అడుగుల కొండచిలువ చొరబడింది.
వెంటనే అప్రమత్తమైన ఇంట్లోని వారు పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు. అది పలు మార్లు అక్కడున్న వారి మీద దాడికి సైతం యత్నించింది.
దీంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కొండచిలువను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని అడవిలో తీసుకెళ్లి వదిలేశారు. కొండచిలువను జాగ్రత్తగా పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.