SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Yadagirigutta: యాదగిరి గుట్టలో 9 అడుగుల భారీ కొండ చిలువ కలకలం.. వీడియో వైరల్..

Python spotted in Yadagirigutta: యాదగిరిపల్లి నుంచి మైలార్‌గూడెం వెళ్లే దారిలో కొండచిలువ ప్రత్యక్షమయ్యింది. అది ఏకంగా 9 అడుగుల పొడవుంది. ఈ క్రమంలో స్థానికంగా పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు.

Written By Inamdar Paresh
Published: Oct 07, 2026, 12:08 PM IST | Updated: Oct 07, 2026, 12:16 PM IST
Image Credit: pythonfoundinyadagiriguttavideo
Join

Giant python enters a home in yadagirigutta residence video viral: ఇటీవల పాములు, కొండ చిలువలు తరచుగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇంట్లో పార్కింగ్ చేసిన కార్లలో, షూస్ లు,  గుబురుగా ఉండే చెట్లలో కోబ్రాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో పాములు, కొండ చిలువలతో జాగ్రత్తగాఉండాలని నిపుణులు తరచుగా చెప్తారు. చీకటిగా ఉండే ప్రదేశాలు, ఎలుకలు ఎక్కువగా ఉండే చోట కూడా ఇవి ఎక్కువగా ఆవాసం చేస్తాయి.

 

 

 ఈ క్రమంలో యాదాద్రి  భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో కొండచిలువ ప్రత్యక్షమయ్యింది. యాదగిరిపల్లి నుంచి మైలార్‌గూడెం వెళ్లే దారిలో కొండచిలువ కన్పించడంతో  అందరు భయంతో వణికిపోయారు. రాచకొండ చిన్నరాజు ఇంట్లోకి  9 అడుగుల కొండచిలువ చొరబడింది. 

వెంటనే అప్రమత్తమైన ఇంట్లోని వారు పాములను పట్టుకునే వారికి సమాచారం అందించారు.  అది పలు మార్లు అక్కడున్న వారి మీద దాడికి సైతం యత్నించింది.

దీంతో రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ కొండచిలువను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని అడవిలో తీసుకెళ్లి వదిలేశారు. కొండచిలువను జాగ్రత్తగా పట్టుకోవడంతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES