• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!

బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!

GO 25 Revision SGTU Demand: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారుతోంది. ఉపాధ్యాయుల తీవ్ర కొరతతో ప్రభుత్వ పాఠశాలల మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి.

Written ByBhoomi
Published: Sep 26, 2026, 09:33 AM IST|Updated: Sep 26, 2026, 09:35 AM IST
joinshare
బోధనకు సమయమేదీ?.. రాష్ట్రంలో 5 వేలకు పైగా సింగిల్ టీచర్ బడులు.. GO 25 సవరించాలని SGTU డిమాండ్..!!
Image Credit: GO 25 Revision SGTU Demand

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

GO 25 Revision SGTU Demand:  తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అత్యంత అధ్వానంగా మారుతోంది. ఉపాధ్యాయుల తీవ్ర కొరతతో ప్రభుత్వ పాఠశాలల మునుపెన్నడూ లేని విధంగా సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. ఒక వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పుష్కలంగా ఉందని.. విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:17గానే ఉందని పాఠశాల విద్యాశాఖ కాగితాల మీద అంకెలు చూపిస్తూ ప్రకటనలు గుప్పిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పాఠశాలలో ఉపాధ్యాయులు లేక.. సరైన బోధన అందక అనాథలుగా మారుతున్నాయి సర్కార్ బడులు. విద్యాశాఖ లోపభూయిష్ట నిర్ణయాలు, నిర్లక్ష్యం వల్ల పేద విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టుతోంది.

రాష్ట్రంలో ఉపాధ్యాయులే ఎక్కువగా ఉన్నారు.. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 17 మాత్రమే. మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తున్నాం.. ఇది సర్కార్ బడులపై విద్యాశాఖ తరచుగా చెబుతున్న మాట. కానీ రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. విద్యార్థుల సంఖ్య మెరుగ్గా ఉన్నప్పటికీ.. అనేక బడుల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొన్ని పాఠశాలల్లో 72 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉన్నారు. మరికొన్నింటిలో 250 మంది విద్యార్థులకు 5గురు ఉపాధ్యాయులు ఉన్నారు. 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు బోధించడానికి కేవలం ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండటం విద్యకు ఆటంకం కలిగిస్తోందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించకుండా, ఉన్నవారిపైనే అధిక భారం మోపుతున్నారని వారు ఆగ్రహంగా ఉన్నారు.


అయితే.. కొన్ని సర్కార్ బడుల్లో ఆరుగురు లేదా ఏడుగురు విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. ఒక విద్యార్థికి ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విద్యాశాఖ మిగుల టీచర్ల సర్దుబాటు చేసే ప్రక్రియను ప్రారంభించినప్పటికీ, అది ఓ కొలిక్కి రాలేదు.  అనేక జిల్లాల్లో ఇష్టానుసారంగా సర్దుబాట్లు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పిల్లలు లేకుండా టీచర్లు ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయి. ఇదేకాదు బోధనతోపాటు భోధనేతర బాధ్యతలతో టీచర్లకు తలనొప్పులు తప్పడం లేదని వారు వాపోతున్నారు. రాష్ట్రంలో 5వేలకు పైగానే సింగిల్ టీచర్ బడులు ఉన్నాయి. వీటిలో ఒకే ఉపాధ్యాయుడు అనేక తరగతులకు బోధించాల్సిన పరిస్థితులు నెలకున్నాయి.  విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులు చాలా పాఠశాలల్లో లేరని ఎస్‌జిటియు రాష్ట్ర అధ్యక్షుడు కె. మహిపాల్ రెడ్డి ఆరోపించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధనతో పాటు తమ బోధనేతర బాధ్యతలను కూడా పెంచుకున్నారని ఉపాధ్యాయ సంఘ నాయకులు అంటున్నారు. 1-5 తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు రోజుకు 18 సబ్జెక్టులు బోధించాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఆన్‌లైన్ పని, రికార్డుల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, అల్పాహారం, సమావేశాలు, నివేదికలు, తనిఖీలతో బోధనకు తగినంత సమయం ఉండటం లేదంటున్నారు. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీ చేసిన జీవో-25ను సమీక్షించాలి. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలల్లో మరింత మంది ఉపాధ్యాయులను, వాలంటీర్లను నియమించాలని ఎస్‌జిటియు డిమాండ్ చేస్తోంది. జీవో-25ను రద్దు చేయాలని, ఎఫ్‌ఎల్‌ఎన్ పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌జిటియు పర్యవేక్షణలో శుక్రవారం కూడా నిరసన కొనసాగుతుందని మహిపాల్ రెడ్డి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా అనేక సర్కార్ బడుల్లో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం:

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య విపరీతంగా ఉన్నప్పటికీ, వారికి పాఠాలు బోధించేందుకు తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో తీవ్ర ఉపాధ్యాయ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండల పరిధిలోని అరిగిద్ద ప్రాథమిక పాఠశాలలో ఏకంగా 377 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా..  అక్కడ కేవలం ఆరుగురు ఉపాధ్యాయులు.. ఒక వాలంటీర్ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అదే విధంగా గట్టు మండలం అలూరు ప్రాథమిక పాఠశాలలోనూ 330 మంది విద్యార్థుల బోధనా బాధ్యతలను కేవలం ఆరుగురు ఉపాధ్యాయులే మోస్తున్నారు.

మరికొన్ని పాఠశాలల్లో ఈ పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. కేశవరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులకు నలుగురు టీచర్లు, ఒక వలంటీర్ మాత్రమే ఉన్నారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఇరికిచేడులో 253 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇద్దరే ఇద్దరు ఉపాధ్యాయులు పనిచేస్తుండటం గమనార్హం.

అలాగే మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తుమ్మిళ్లలో 250 మంది విద్యార్థులకు ఐదుగురు ఉపాధ్యాయులు మాత్రమే బోధన అందిస్తుండగా, మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల రంగాపూర్‌లో 110 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ గణాంకాలన్నీ కూడా క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయుల కొరత ఎంత తీవ్రంగా ఉందో.. దానివల్ల విద్యార్థుల విద్యాబోధన ఏ స్థాయిలో కుంటుపడుతుందో స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.

ప్రభుత్వం, విద్యాశాఖ ఇప్పటికైనా దాగుడుమూతల ధోరణి పక్కన పెట్టి.. కాగితాల్లో లెక్కలు చూపించడం కాకుండా.. క్షేత్రస్థాయిలో పాఠశాలలను పర్యవేక్షించాలని కోరుతున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడంతోపాటు..  ప్రభుత్వ పాఠశాలలను  ఈ తీవ్ర సంక్షోభం నుంచి గట్టెక్కించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Employees