New Pensions: పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా పరిశీలనలో ఉన్న వాటన్నింటినీ వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి విచారణ, ధ్రువీకరణ ప్రక్రియతో పాటు ఆమోద ముద్ర వేసే కార్యక్రమాన్ని నిర్దేశిత టైమ్ లైన్‌లోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన ఏ ఒక్క చేనేత కార్మికుడూ సాంకేతిక కారణాలతో నష్టపోకూడదని తెలిపారు.
తెలంగాణలో రేపటి నుంచి చేనేత పెన్షన్లు..
మంజూరైన కొత్త పెన్షన్లను పారదర్శకంగా, పండుగ వాతావరణంలో లబ్ధిదారులకు అందజేసేందుకు చర్యలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాలు/వార్డుల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తూ కొత్త లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేసేలా కార్యక్రమం ఉండనుంది.
ఈ నెల 18 వరకు కొత్తగా మంజూరు చేసిన చేనేత పెన్షన్ల పంపిణీ..
పంపిణీ ప్రక్రియలో లబ్ధిదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులు కల్పించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న వేలాది మంది చేనేత కార్మిక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వచ్చేనెలతో 3 యేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన అందరికీ పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు సహా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేసే పనిలో పడింది. తాజాగా అర్హులైన పేదలకు, వితంతవుకు పెన్షన్ పథకాన్ని దీపావళి నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే కదా.