• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

Telangana Government: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో సినిమా ప్రమోషన్లతో పాటు ఇతర ప్రైవేట్ వేడుకలను నిర్వహించకుండా నిషేధించేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుడుతోంది.

Written ByBhoomi
Published: Nov 11, 2026, 09:51 AM IST|Updated: Nov 11, 2026, 09:53 AM IST
joinshare
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
Image Credit: Telangana Government:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!

ఐపీఎల్ హిస్టరీలోనే బిగ్ ట్రేడింగ్..పంజాబ్‎కు హార్దిక్ పాండ్యా.. ముంబై‎కు అర్ష‌దీప్ సింగ్‌..!!

2

తెలంగాణలో చలి పంజా.. 2 రోజుల్లోనే 15 డిగ్రీల దిగువకు టెంపరేచర్లు..

3

జాతీయ విద్యా దినోత్సవం.. IIT, UGCల వ్యవస్థాపకుడు ఆజాద్ ఆశయాలు నెరవేరుతున్నాయా?.. నేటి విద్యా వ్యవస్థ సవాళ్లు ఇవే..!!

4

గురుడు ఉచ్ఛస్థితిలోకి ప్రవేశం.. కన్య, మకరంతో సహా 4 రాశులకు బంపర్ లాభాలు!

5

విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్లకు చెక్.. వరుస ఘటనలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Government: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలల్లో సినిమా ప్రమోషన్లతో పాటు ఇతర ప్రైవేట్ వేడుకలను నిర్వహించకుండా నిషేధించేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఇటీవల కొన్ని విద్యాసంస్థల్లో జరిగిన ఊహించని ప్రమాదాల వల్ల విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంపై ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. విద్యార్థుల భద్రతను పక్కనపెట్టి ప్రమోషన్లు, ప్రైవేట్ ఈవెంట్లకు అనుమతులిస్తూ యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల రక్షణే ధ్యేయంగా విద్యాసంస్థల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదనే అంశంపై త్వరలోనే కఠినమైన నూతన మార్గదర్శకాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఇటీవల.. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో సరైన భద్రతా ఏర్పాట్లు లేకుండా నిర్వహించిన దండియా కార్యక్రమంలో ఒక విద్యార్థి మరణించగా.. పలువురు గాయపడ్డారు. మరో ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సినిమా ప్రచార కార్యక్రమం కూడా వివాదానికి దారితీసింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నివారించడానికి, విద్యా ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చనే దానిపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వం విద్యా విభాగాన్ని ఆదేశించింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం..  ప్రాంగణాలను కేవలం విద్యా, క్రీడా సంబంధిత కార్యక్రమాల కోసం మాత్రమే ఉపయోగించాలి. సినిమా ప్రచారాలు, ఇతర వాణిజ్య కార్యక్రమాలు పూర్తిగా నిషేధం. ఒకవేళ భారీ స్థాయిలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాల్సి వస్తే, హాజరయ్యే వారి సంఖ్య, భద్రతా ఏర్పాట్ల గురించి పోలీసులు, అగ్నిమాపక శాఖలు ముందుగానే తెలియజేయాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించే విద్యా సంస్థల యజమానులపై భారీ జరిమానాలతో సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థుల భద్రతను నిర్లక్ష్యం చేస్తూ, వాణిజ్య లాభాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతపై ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ కూడా ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కానున్నాయి. 

 

Also Read: 

 

ఎన్విడియా CEOకు బిగ్ షాక్.. ఒక్కరోజే రూ.17 లక్షల కోట్లు  ఆవిరి..!!

తెలంగాణాలో వారానికి 5 రోజుల పనిదినాలపై సర్కార్ ఆరా..?

 

ఉద్యోగులకు సుప్రీం బిగ్ షాక్.. ఆ ఒక్క తప్పు చేస్తే ఇక నేరుగా సస్పెన్షనే..!!

 

తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు జైలు శిక్ష..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News