• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Harish Rao: సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌

Harish Rao: సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌

Harish Rao Challenge To Revanth Reddy On Assets: తమ ఆస్తులు, రేవంత్ రెడ్డి ఆస్తులపైన సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు సవాల్‌ చేశారు. తప్పు మీ వైపు ఉంటే ముక్కు నేలకు రాస్తావా?' అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 16, 2026, 07:06 PM IST|Updated: Sep 16, 2026, 07:10 PM IST
joinshare
Harish Rao: సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమా? రేవంత్‌ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్‌
Image Credit: Harish Rao Challenge To Revanth Reddy

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Revanth Reddy Assets: ఆస్తులపై అసెంబ్లీ వేదికగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు స్పందిస్తూ రేవంత్‌ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు సవాళ్లు చేశారు. ఆస్తులపై సిట్టింగ్‌ జడ్జితో చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్‌ చేశారు. 22ఏపై ఎవరి హయాంలో తప్పు జరిగిందో తేల్చుకుందామని.. తప్పు మీ వైపు ఉంటే ముక్కు నేలకు రాస్తావా? అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ భవన్‌లో బుధవారం మాజీ మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 'కలెక్టర్లు పాత జాబితాను అప్లోడ్ చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది అని రేవంత్‌ రెడ్డి చెప్పాడు. చట్టం అందరికీ ఒక్కటే రేవంత్ రెడ్డి. అందుకే నీ ఇల్లు ఉంటే ఏంటి పోతే ఏంటి? ఎప్పటివరకు ప్రజలు సమస్యలు పరిష్కరిస్తావు చెప్పు?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమం చేయకుంటే తెలంగాణ వస్తుండేనా? నువ్వు ముఖ్యమంత్రివి అయ్యే వాడివా రేవంత్‌ రెడ్డి అని నిలదీశారు. 'పొంగులేటి, వస్తాడా, నువ్వు వస్తావా ఎవరి హయాంలో జరిగింది ఈ తప్పు తేల్చుకుందాం చెప్పు' అంటూ రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు సవాల్‌ చేశారు.

'బీఆర్‌ఎస్‌ పార్టీ హయాంలో రిజిస్ట్రేషన్‌లో ఆగితే, మీ హయాంలో రిజిస్ట్రేషన్‌లు ఆగాయో తేల్చుకుందాం. తప్పు మీ వైపు ఉంటే ముక్కు నేలకు రాస్తావా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు నిలదీశారు. 'ఎన్నికల అఫిడవిట్‌లో ఉన్నవే నువ్వు చెప్పావు. మేము గట్టిగా అడిగితే మమ్మల్ని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నావు. మంత్రి, అధికారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. పాపం చిన్న చిన్న డేటా ఎంట్రీ ఆపరేటర్‌లపై చర్యలు తీసుకున్నారు' అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు తెలిపారు.

'కుంభకోణం బయటకు రాకుండా జాగ్రత పడుతున్నారు. డబ్బులు ఎవరి జేబులోకి వెళ్లాయి. 9,200 మంది భూములు ఆస్తులు ఇతరులు పేరు మీదకి మారింది. ఇంతకంటే ఎక్కువే ఉండవచ్చు. భూ భారతిలో అక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు తెలియకుండా ప్రజలు భూములు బదలీలో మేము ప్రశ్నించిన ఒక్క కుంభకోణంపైన మాట్లాడవా' అని రేవంత్‌ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. మీ తమ్ముడికి లక్ష రూపాయి మూలధనంతో భూమి ఇచ్చావా అని బయట పెడితే స్పందించావా? అని నిలదీశారు. ఒక్క దానిపై ఎందుకు మాట్లాడవు అని మండిపడ్డారు.

'బీఆర్ఎస్ పార్టీ ఏమి పని చేయలేదు అని ఎదురు దాడికి దిగుతున్నావు. తెలంగాణ కోసం అయినా చావు అంచులు దాకా వెళ్లి వచ్చిన మనిషి కేసీఆర్‌. మొన్నటి వరకు వెయ్యి ఎకరాలు అన్నావు. ఇప్పుడు 64 ఎకరాలు అంటున్నావు నీ మాటలు ప్రజలు గమినిస్తున్నారు' అని రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌ రావు హితవు పలికారు. 'కేసీఆర్‌ పుట్టుకతోనే వందల ఎకరాలున్నాయి. చింతమడకకు వెళ్తే ఎవరైనా చెప్తారు' అని రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Assembly