Bhadradri kothagudem: భద్రాద్రి కొత్తగూడెంలో అమానుషం.. విద్యార్థులను పైపులతో కొట్టి వాతాలు పెట్టిన హెడ్ మాస్టర్.!.
Head master assaulted students in bhadradri: మిషన్ భగీరథ వాటర్ పైపుతో 12 మంది విద్యార్థులను కొట్టిన ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో వెలుగులోకి వచ్చింది. దీనిపై స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Head master brutally beating students in Bhadradri kothagudem: ఇటీవల కొంత మంది ప్రభుత్వ పాఠశాలలో తరచుగా వార్తలలో ఉంటున్నాయి. ముఖ్యంగా కొంత మంది స్కూల్ కు సంబంధించిన సిబ్బంది వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారు. అంతే కాకుండా స్కూళ్లలో విద్యార్థులపై దాడులు చేయడం, వారితో తమ పర్సనల్ పనులు చేయించు కోవడం వంటి వాటితో వివాదాల్లో చిక్కుకుంటున్నారు.
కొంత మంది ఇలాంటి పనులు చేసిన మొత్తంగా పాఠశాలలకే ప్రస్తుతం చెడ్డపేరు వచ్చేలా సిట్యువేషన్ ఏర్పడింది. ఈ క్రమంలో ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మణుగురులోని రామానుజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు అల్లరి చేశారంటూ హెడ్ మాస్టర్ ఆవేశంలో ఊగిపోయింది. ఏకంగా మిషన్ భగీరథ వాటర్ పైపుతో 12 మంది విద్యార్థులను కొట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో విద్యార్థుల వీపుల మీద వాతలు సైతం తెలాయి. దీన్ని గమనించిన తల్లిదండ్రులు స్కూల్ కు వచ్చి ప్రధానోపాధ్యాయురాలిని నిలదీయడంతో పొంతనలేని సమాధానం చెప్పారు.
ఈ క్రమంలో దీనిపై స్థానికంగా తీవ్ర వివాదం రాజుకుంది. విద్యార్థులను కొట్టిన ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదంపై ఉన్నతాధికారులు సైతం సీరియస్ గా తీసుకున్నారు. విద్యార్థులపై చేయ్యి చేసుకున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.