Asifabad: తప్పతాగి స్కూలుకు వచ్చిన హెడ్‌మాస్టర్... రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న విద్యార్థులు.. వీడియో వైరల్..
Asifabad Head master news: స్కూల్ ఆవరణలో హెడ్‌మాస్టర్ తప్పతాగి రావడంను విద్యార్థులు గమనించారు. దీనిపై వివాదం తలెత్తడంతో గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అసిఫాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Head master consuming alcohol in asifabad: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను మంచి స్కూళ్లలో వేస్తుంటారు. విద్యార్థులకు మంచి చదువు అందించడానికి తెగ ఆరాట పడతారు. దీని కోసం ఎలాంటి త్యాగాలకైన వెనుకాడరు. మంచి స్కూళ్లలో వేస్తే వారి జీవితం బాగుంటుందని భావిస్తారు. అయితే కొంత మంది టీచర్లు పాఠశాలల్లో మంచి చదువులు బోధిస్తు పిల్లల్ని అన్ని రంగాల్లో ముందుకు తెవడానికి ఆరాటపడుతుంటారు. పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా బోధిస్తారు. కానీ మరికొంత మంది మాత్రం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వారు చేస్తున్న పనులతో వివాదాస్పదంగా మారుతున్నారు. కొంత మంది తప్పతాగి స్కూళ్లకు రావడం వంటివి చేస్తున్నారు.
మరికొంత మంది బాలికల్ని లైంగికంగా వేధిస్తున్నారు. అంతే కాకుండా పవిత్రమైన పాఠశాలలో తోటి టీచర్లను సైతం వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలో ఒక ఉపాధ్యాయుడి నిర్వాకం వార్తలలో నిలిచింది. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గంభీరావు పేటలో స్కూల్ లో హెడ్‌మాస్టర్ తప్పతాగి వచ్చాడు. అంతే కాకుండా స్కూల్లోనే వైన్ బాటిల్ ను తెచ్చుకుని సీక్రెట్గా తాగుతూ హల్ చల్ చేశారు.
ఈ క్రమంలో హెడ్‌మాస్టర్ నిర్వాకంను కొంత మంది విద్యార్థులు గమనించారు. వెంటనే గ్రామస్తులకు చెప్పారు. దీంతో గ్రామస్తులు మాటు వేసి హెడ్‌మాస్టర్ ను సీక్రెట్ గా మద్యం తాగుతున్నప్పుడు పట్టుకున్నారు. ఆ తర్వాత గట్టిగా ప్రశ్నిస్తే మద్యం మత్తులో తులుతూ పొంతనలేని సమాధానం చెప్పాడు. ఇక లాభంలేదని గ్రామస్తులు ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటనపై స్థానికంగా వివాదం రాజుకుంది. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై చర్యలు తీసుకొవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.