• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /తెలంగాణలో ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్..

తెలంగాణలో ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్..

Heavy Rains in Telangana: తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఎల్‌నినో ప్రభావంతో పలు చోట్ల అడుగంటిన నీటి మట్టాలు ఈ వర్షాల వల్ల కాస్త తేరుకునే అవకాశాలున్నాయి. నిన్నటి నుంచి తెలంగాణలో పలు జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురిసాయి. ఇక మరో రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 06:36 AM IST|Updated: Oct 31, 2026, 07:46 AM IST
joinshare
తెలంగాణలో ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్..
Image Credit: Telangana Rains (AI Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణ పింఛన్‌దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అక్కడ అప్లై చేస్తే వెంటనే పెన్షన్..!!

తెలంగాణ పింఛన్‌దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అక్కడ అప్లై చేస్తే వెంటనే పెన్షన్..!!

2

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత.. GSLV F-18 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌..

3

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీకి అతి భారీ వర్షాలు..

4

తెలంగాణలో ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్..

5

హైదరాబాద్‌ను కుమ్మేసిన వాన.. తడిసిన ముద్దయిన నగరం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana Rain Alert: తెలంగాణలో నేడు, రేపు  భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్‌,  ఖమ్మం,నల్లగొండ, వరంగల్‌, హనుమకొండ, జనగాం జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్‌ కూడా జారీ చేసింది.

అల్ప పీడనం ప్రభావంతో వర్షాలు..  

కాగా నిన్న అల్పపీడనం ప్రభావంతో నిన్న తెలంగాణలో పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. అత్యధికంగా మల్కాజిగిరి జిల్లా కీసరలో 11.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. గంటన్నర పాటు  దంచికొట్టిన వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రంగారెడ్డి, నల్గొండ, యాదాద్రి జిల్లాల్లోనూ వాన దంచికొట్టింది. ఈ అకాల వర్షాలకు పలు ప్రాంతాల్లో కోతలకు సిద్ధమైన వరి, పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు
ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం భారీ వర్షం కురిసింది. గంటపాటు దంచికొట్టిన వర్షంతో ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడంతో పలు ప్రాంతా ల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. షేక్‌పేట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, బహుదూర్‌పురా, చార్మినార్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్‌, నార్సింగ్‌ప్రాంతాల్లో రహదారులపై మోకాళ్లలోతు వరదనీరు నిలిచిపోయింది. ఐటీ కారిడార్‌లోని మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలితో పాటు మైండ్‌స్పేస్‌, ఐకియా ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రాత్రి 8 గంటల వరకు కీసరలో అత్యధికంగా 10.8 సెం.మీ, బహుదూర్‌పురాలో 8.2 సెం.మీ, శేరిలింగంపల్లిలో 7.3 సెం.మీ వర్షపా తం నమోదైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Telangana News
Rain News