• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /హైదరాబాద్‌ను కుమ్మేసిన వాన.. తడిసిన ముద్దయిన నగరం..

హైదరాబాద్‌ను కుమ్మేసిన వాన.. తడిసిన ముద్దయిన నగరం..

Hyderabad Rains: భాగ్యనగరాన్ని నిన్న వర్షాలు ముంచెత్తాయి. గత 35 రోజులుగా చినుకు లేక అల్లాడిపోయిన హైదరాబాదీలను కుండపోత వాన ముంచెత్తింది. సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు సిటీలో నాన్ స్టాప్‎గా వర్షం దంచికొట్టింది. ఎల్‎నినో ప్రభావంతో వర్షాలు లేక జనం అల్లాడిపోతున్న వేళ రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ఎల్బీనగర్ ఏరియాలో మొదటగా ప్రారంభమైన వర్షం క్రమంగా నగరమంతా విస్తరించింది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 31, 2026, 05:33 AM IST|Updated: Oct 31, 2026, 07:37 AM IST
joinshare
హైదరాబాద్‌ను కుమ్మేసిన వాన.. తడిసిన ముద్దయిన నగరం..
Image Credit: Heavy Rains in Hyderabad (ZEE News/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తెలంగాణ పింఛన్‌దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అక్కడ అప్లై చేస్తే వెంటనే పెన్షన్..!!

తెలంగాణ పింఛన్‌దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అక్కడ అప్లై చేస్తే వెంటనే పెన్షన్..!!

2

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ఘనత.. GSLV F-18 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌..

3

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీకి అతి భారీ వర్షాలు..

4

తెలంగాణలో ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్..

5

హైదరాబాద్‌ను కుమ్మేసిన వాన.. తడిసిన ముద్దయిన నగరం..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heavy Rains in Hyderabad: హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు భాగ్యనగరం నడిబొడ్డైన  పాతబస్తీలో వర్షం బీభత్సం స్పష్టించింది. అత్యధికంగా కీసరలో 11.2 సెం.మీ అత్యధిక వర్షపాతం కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక  బహదూర్ పూరాలో కేవలం గంటలోనే ఏకంగా 8.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అబ్దుల్లాపూర్ మెట్‌లో 7.65 సెం.మీ,  మాదాపూర్ లో 7.38 సెంటీ మీటర్లు, షేక్ పేట గోల్కొండ పరిధిలో 6.68 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. మొత్తంగా హైదరాబాద్‌లోని మూడు కార్పోరేషన్ల పరిధిలో వర్షం కుమ్మేసిందనే చెప్పాలి.

రోడ్లపైకి వర్షపు నీరు..
వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో సిటీలోని రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి.  సరిగ్గా ఆఫీసులు ముగిసి ఉద్యోగులు ఇంటికి వెళ్లే సమయంలోనే వర్షం దంచికొట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఐటీ కారిడార్‎లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 100 మీటర్ల దూరం ప్రయాణించాలంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పట్టింది. దీంతో ఐటీ ఎంప్లాయిస్ నరకయాతన అనుభవించారు.

ఈదురు గాలులతో కూడిన వర్షం.. 
ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, కరెంట్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు, జీహెచ్ఎంసీ,  హైడ్రా సిబ్బంది సహయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వాహనాల రద్దీని క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. భారీ వర్షం నేపథ్యంలో నగర ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు పలు కీలక సూచనలు చేశారు. అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు వెళ్లొద్దని సూచించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana Weather
Hyderabad
Weather Update
Telangana News