• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ఇండస్ట్రీ పెద్దలపై హీరో షిరాజ్ మెహదీ ఫైర్.. సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలి..

ఇండస్ట్రీ పెద్దలపై హీరో షిరాజ్ మెహదీ ఫైర్.. సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలి..

Hero Cum Director Sheraz Mehdi Fire on Industry Biggies: సినీ ఇండస్ట్రీలో కొంత మంది గుత్తాధిపత్యం నడుస్తోంది. థియేటర్స్ ఇవ్వరు. ఓటీటీకి అమ్ముకోనివ్వరు. శాటిలైట్ హక్కులకు దిక్కులేదు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన దర్శక, నిర్మాత కమ్ హీరో షిరాజ్ మెహదీ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 18, 2026, 08:48 AM IST|Updated: Oct 18, 2026, 08:51 PM IST
joinshare
ఇండస్ట్రీ పెద్దలపై హీరో షిరాజ్ మెహదీ ఫైర్.. సీఎం రేవంత్ జోక్యం చేసుకోవాలి..
Image Credit: Tollywood Producer Comments (File/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

రష్యా నుంచి చమురు.. యూరప్‌కు పెట్రోలియం ఉత్పత్తులు.. భారత్ అసలు వ్యూహం ఇదే!

2

వరి దిగుబడులు బాగున్నా.. బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

3

అల్యూమినియం vs స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్: రోజువారీ వంటకు ఏది సురక్షితమో తెలిస్తే వెంటనే మార్చేస్తారు!

4

ఈ 6 ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ రీహీట్ చేయకూడదు.. ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటే ఇవి తెలుసుకోండి!

5

AI GF మాయలో పడి సర్వం కోల్పోయిన వ్యక్తి.. 1900 కిలోమీటర్లు ప్రయాణించి వెళ్లగా షాక్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Sheraz Mehdi: ఈ మధ్య కాలంలో ఓ సినిమా తీయడం ఒక ఎత్తయితే.. దాన్ని థియేటర్లలో రిలీజ్  చేయడం మరో ఎత్తు.  చిన్న సినిమా నిర్మాతలకు అసలు పరీక్ష సినిమా నిర్మాణం పూర్తయిన తర్వాతే మొదలవుతుందని చెబుతున్నారు.  పెట్టుబడులు పెట్టి, అప్పులు చేసి సినిమాలు తీస్తున్న నిర్మాతలకు సరైన థియేటర్లు దొరకడం లేదు. అంతేకాదు  ఓటీటీ, శాటిలైట్ హక్కులు విక్రయించుకునే అవకాశాలు కూడా ఇస్తలేరు. చిన్న సినిమాల విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో వివక్ష కొనసాగుతుంని  ‘ఓ అందాల రాక్షసీ’ హీరో, నిర్మాత షిరాజ్ మెహదీ చేసిన వ్యాఖ్యలు  ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.

చిన్న సినిమాలకు స్క్రీన్స్ ఇవ్వకుండా, వాటి వ్యాపార అవకాశాలను దెబ్బతీస్తున్నారంటూ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు, సంస్థల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న సినిమాల నిర్మాతల కష్టాలను పట్టించుకునేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

సినిమా తీయడమే నేరమా?
సినిమా నిర్మాణం కోసం ప్రొడ్యూసర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారన్నారు. ఎన్నో ఆశలతో సినిమా పూర్తి చేసిన తర్వాత విడుదల, వ్యాపారం విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని షిరాజ్ మెహదీ పేర్కొన్నారు. సినిమా తీయడానికి ముందుకొచ్చిన నిర్మాతకు, సినిమా పూర్తయిన తర్వాత అండగా నిలిచేవారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫిలిం చాంబ‌ర్ వాళ్లు ‘మీరు సినిమా ఎందుకు తీశారు?’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  ఇత‌రులు తీసే సినిమాల‌తో తమకు సంబంధం లేదన్న ధోరణిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌న్నారు. సినిమా నిర్మాణానికి ప్రోత్సాహం ఇవ్వకపోగా, విడుదల సమయంలోనూ అడ్డంకులు ఎదురైతే చిన్న నిర్మాతలు ఎవరిని ఆశ్రయించాలన్నారు. తెలుగు ఫిలిం చాంబ‌ర్ స్థానంలో తెలంగాణ విభాగాన్ని ఏర్పాటు చేయాల్సిందేని డిమాండ్ చేశారు.

థియేటర్లు లేవు.. ఓటీటీ కొనదు.. నిర్మాత బతికేదెలా?
చిన్న సినిమాలకు థియేటర్లు కేటాయించకపోవడం, ఓటీటీ సంస్థలు, శాటిలైట్ ఛానెళ్ల ద్వారా హక్కులు అమ్ముకునే ఛాన్సు ఇవ్వడం లేదని షిరాజ్ మెహదీ ఆరోపించారు.

సినిమా కోసం డబ్బు పెట్టిన నిర్మాతకు పెట్టుబడి తిరిగి వచ్చే మార్గాలే మూసుకుపోతే ఎలా బతకాలని ప్రశ్నించారు. పెద్ద సినిమాలకు లభించే అవకాశాలు చిన్న సినిమాలకు ఎందుకు లభించడం లేదని నిలదీశారు.

ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తోంది?
చిన్న సినిమాల వ్యాపార సమస్యలపై ఫిల్మ్ ఛాంబర్ బాధ్యత తీసుకోవడం లేదని షిరాజ్ మెహదీ విమర్శించారు.తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు విదేశీ మార్కెట్లలోనూ సినిమాల హక్కుల విక్రయాలకు పారదర్శకమైన విధానం ఉండాలన్నారు.  ప్రతి సినిమాకు వ్యాపార అవకాశాలు కల్పించే వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు.

‘రైతు ప్రాణమే ప్రాణమా.. సినీ కార్మికుల ప్రాణాలు కావా?
చిన్న సినిమాల వెనుక ఎంతోమంది జీవితాలు, కుటుంబాల భవిష్యత్తు ముడిపడి ఉంటాయని షిరాజ్ మెహదీ అన్నారు. ఒక రైతు నష్టపోయినా, ప్రాణాలు కోల్పోయినా సమాజం స్పందిస్తుందన్నారు.  మరి సినిమా కోసం అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి నష్టపోయే నిర్మాతలు, దర్శకులు, నటీనటుల పరిస్థితిని ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు.

సినిమా రంగంలోనూ చిన్న నిర్మాతల సమస్యలను మానవీయ కోణంలో చూడాలన్నారు.  వారి ఆర్థిక ఇబ్బందులను తేలికగా తీసుకోకూడదని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవాలి..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చిన్న సినిమాలను ఆదుకోవాలని షిరాజ్ మెహదీ విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్ చిత్రాలకు సబ్సిడీలు అందించడం, థియేటర్ల కేటాయింపుల్లో పారదర్శకత తీసుకురావడం, ఓటీటీ, శాటిలైట్ హక్కుల విక్రయాలకు ఛాన్సులు  పెంచడం వంటి చర్యలు చేపట్టాలని కోరారు.ప్రభుత్వం చొరవ తీసుకుంటే చిన్న సినిమాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Tollywood