మేడ్చల్ కలెక్టర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం.. కోర్టులో హాజరుపరచాలని సీపీకి ఆదేశాలు..!!
High Court: ప్రభుత్వ భూముల వ్యవహారంలో కలెక్టర్లపై హైకోర్టుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకున్న కోర్టు.. నేడు మేడ్చల్ మల్కాజ్ గిరి కలెక్టర్ మనూ చౌదరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కలెక్టర్ ను వెంటనే కోర్టులో హాజరు పర్చాలని సీపీని ఆదేశించింది. అసలేం జరిగిందంటే..

ప్రభుత్వ భూముల వ్యవహారంలో.. కోర్టు ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై తెలంగాణ హైకోర్టు ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మనూ చౌదరి తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంలో.. కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమవ్వడమే కాకుండా, విచారణకు హాజరుకాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ను నేరుగా కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌ను హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల కాలంలో న్యాయస్థానం ఇచ్చిన స్పష్టమైన ఉత్తర్వులను ధిక్కరించిన కేసులో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌పై కూడా జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విధంగా సీరియస్ కావడంతో ప్రభుత్వ యంత్రాగంలో తీవ్ర కలకలం రేగింది.
న్యాయస్థాన ఆదేశాలను బేఖాతరు చేసే అధికారులపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగానూ, అధికార వర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ భూముల పరిరక్షణ.. కోర్టు ధిక్కరణ కేసులపై హైకోర్టు అనుసరిస్తున్న ఈ కఠిన వైఖరి అధికారుల్లో వణుకు పుట్టిస్తోంది.
Also Read:
వైట్‌కాలర్ ఉద్యోగాలకు AI పెద్ద ముప్పు.. బ్లూకాలర్‌కే ఢోకా లేదు: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!!