SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: డేటింగ్ యాప్‌లో పరిచయం.. హస్కీగా మాట్లాడి జూబ్లీహిల్స్ పబ్‌కి తీసుకెళ్లిన యువతి.. ఏంచేసిందంటే..?..

Honey trap case in hyderabad: క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన దివ్య అనే యువతితో హేమంత్ పబ్‌కు వెళ్లాడు. అక్కడ తన తియ్యని హస్కీ మాటలతో అతడ్ని రొమాంటిక్ మూడ్ లోకి దింపింది. తెరుకునేలోపు ఏకంగా ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసి రూ.29,000 బిల్లింగ్ చేసింది. హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 08:03 PM IST | Updated: Sep 29, 2026, 08:17 PM IST
Image Credit: Hyderabadcrime(file)
Join

Honey Trap Scam burst at Jubilee Hills Pub in Hyderabad: ఇటీవల కాలంలో కొంత మంది కేటుగాళ్లు సోషల్ మీడియాల వేదికగా రకరకాల మోసాలకు తెరతీస్తున్నారు. ముఖ్యంగా ఇన్ స్టాలు, ఫెస్ బుక్ లతో రిక్వెస్ట్ లు, మెస్సెజ్ లను పెట్టి మరీ అవతరలి వారిని బురిడి కొట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో  కొంత మంది ఫెక్ ఐడీలు క్రియేట్ చేసి ఏఐతో అమ్మాయిల వాయిస్ లతో బుట్టలో వేసుకుంటున్నారు.

 మరికొంత మంది కేటుగాళ్లు గ్యాంగ్ లుగా ఏర్పడి అమ్మాయిలతో అవతలి వారిని రెచ్చగొట్టేలా మాట్లాడి రొమాంటిక్ మూడ్ లోకి దించుతున్నారు. ఆ తర్వాత హోటల్ లు, రెస్టారెంట్ లు, పబ్ లకు తీసుకెళ్లి అందిన కాడికి దోచుకుంటున్నారు. దీనిలో కొంత మంది పబ్ నిర్వాహకులు సైతం అమ్మాయిలను ఎరగా వేసి అధికంగా బిల్లులు వేస్తు కొత్తతరహా మోసాలకు తెరతీస్తున్నారు. తాజాగా..ఈ కోవకు చెందిన ఘటన హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ లో వెలుగులోకి వచ్చింది.


హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని 36 కెమిస్ట్రీ పబ్‌లో హనీ ట్రాప్ ఘటన వెలుగు లోకి వచ్చింది. క్వాక్ క్వాక్ డేటింగ్ యాప్ ద్వారా హేమంత్‌కు దివ్య అనే యువతి పరిచయం అయ్యింది. ఆతర్వాత కొంత కాలం ఇద్దరుచాట్ లు, వీడియో కాల్స్ చేసుకున్నారు. మొత్తంగా యువకుడ్ని తన బుట్టలో వేసుకుంది. ఆతర్వాత పబ్ కు వెళ్దామనగానే హేమంత్ ఎగిరి గంతేసి వెళ్లిపోయాడు.

 కానీ అక్కడ అసలు స్కెచ్ ను ఊహించలేకపోయాడు.  దివ్యతో కలిసి 36 కెమిస్ట్రీ పబ్‌కు వెళ్లిన హేమంత్ కు అప్పటికే పబ్ యాజమాన్యంతో కుమ్మక్కైంది. అతనితో లిక్కర్, వివిధ రకాల స్నాక్స్ లను ఆర్డర్ చేయించింది.అతడిని మాటల్లో పెట్టి బిల్లింగ్ సమయంలో..ఫేక్ పేమెంట్ ట్రాన్సాక్షన్ చేసింది.  దీంతో అతని అకౌంట్ నుంచి ఏకంగా.. రూ.29వేల బిల్లింగ్ అయ్యింది. ఈ మోసాన్ని గుర్తించిన హేమంత్ పబ్ యాజమాన్యంను నిలదీశాడు. 

అప్పటికే యువతి అక్కడి నుంచి కూల్ గా జారుకుంది. ఇక మోసపోయానని గ్రహించిన  బాధితుడి హేమంత్ జూబ్లిహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసుల హనీ ట్రాప్ ఘటన, పబ్ నిర్వాహకుల పాత్ర ఈ కేసులో ఎంత వరకు ఉందని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.  మరోవైపు పోలీసులు గుర్తు తెలియన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని,ఆన్ లైన్ యాప్ లు, హనీట్రాప్ లతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES