CP Sajjanar dance video: ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం.. డ్యాన్స్‌తో హల్ చల్ చేసిన సీపీ సజ్జనార్.. వీడియో వైరల్..
Hyderabad ganesh immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనం ప్రశాతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో సీపీ సజ్జనార్ వినాయక నిమజ్జనం వద్ద మాస్ స్టెప్పులు వేసి అందరిని ఆశ్చర్యపరిచారు.
Hyderabad cp sajjanar mass dance during ganesh immersion on tank bund: హైదరాబాద్ వినాయక నిమజ్జనం ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలకు చెందిన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని, భక్తుల భద్రతే ప్రభుత్వం ప్రథమ కర్తవ్యమన్నారు. మరోవైపు ఏఐ టెక్నాలనీ, నిమజ్జనం పొడవున పదివేలకు పైగా సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా బలగాలను రంగంలోకి దింపారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన భద్రత చేపట్టారు.
ముఖ్యంగా ఖైరతాబాద్, బాలాపూర్ గణపయ్యలు గంగమ్మ ఓడిలోకి చేరే వరకు పోలీసులు ఎంతో చాకచక్యంగా ట్రాఫిక్ కుక్రమబద్దికరిస్తు, ఎక్కడ కూడా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో కూడా అధికారులు నిమజ్జనం ముగిసే వరకు రోడ్ల మీదనే ఉండి, అధికారులకు సూచనలు ఇస్తు నిమజ్జనం విధులు నిర్వహించారు. ముఖ్యంగా డీజీపీ సీవీ ఆనంద్ , సీపీ సజ్జనార్ వివిధ శాఖలకు చెందిన అధికారులు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ నిమజ్జనంను తొందరగా అయ్యేలా చూశారు.
పోలీసులు కూడా భక్తులతో,యూత్ వారితో సౌండ్ సిస్టమ్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. నాని మూవీ ది ప్యారడైజ్ మూవీ పాటలతో నిమజ్జనం మార్మొగిపోయింది. ఇక నిన్న శుక్రవారం ప్రారంభమైన హైదరాబాద్ వినాయక నిమజ్జనం ఈరోజు శనివారం సాయంత్రం వరకు కొనసాగింది. ఈ క్రమంలో హైదరాబాద్ సీపీ సజ్జనార్ సైతం ఒకవైపు విధులలో బిజీగా ఉంటూనే.. మరోవైపు నిమజ్జనంలో డ్యాన్స్ చేసి ఫైనల్ టచ్ ఇచ్చారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తన సిబ్బందితో కలిసి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కింద పోలీసు సిబ్బందితో కలిసి సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేశారు. 'ది ప్యారడైజ్' చిత్రంలోని 'ఆయా షేర్' పాటకు ఆయన అదిరిపోయే స్టెప్పులు వేశారు. గత కొన్ని రోజులుగా విధుల్లో నిమగ్నమై బిజీగా ఉన్న అధికారులు కాస్త నిమజ్జనం అయిపోవడంతో డ్యాన్స్ చేస్తు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
సీపీ సజ్జనార్ డ్యాన్స్ చేయడంతో అక్కడున్న ఇతర సిబ్బంది సైతం మరింత జోష్ తో మాస్ స్టెప్పులు వేశారు. మరోవైపు, నగరంలో నిమజ్జన క్రతువు ముగియడంతో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను ఎత్తివేశారు. జంటనగరాల పరిధిలో మరల వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.