SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

DA Hike: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. డీఏ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!

Jackpot To Telangana Govt Employees DA Hike Orders Issued: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. దీపావళిని పురస్కరించుకుని విడుదల చేసిన కరువు భత్యానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపునకు సంబంధించి ప్రభుత్వం మొన్న ఆదేశాలు ఇచ్చారు. డీఏ ఉత్తర్వులు ఇవ్వడంతో ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 04, 2026, 09:49 PM IST | Updated: Nov 04, 2026, 09:52 PM IST
Image Credit: Bhatti Vikramarka Employees
Join

Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ) పెంపునకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపునకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. జూలై 2026 నుంచి 2.543 శాతం డీఏ పెంపు అమలు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. డీఏ పెంపు ఉత్తర్వులు జారీ కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మలలు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ‎విద్యుత్ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ) పెంపునకు ఆమోదం తెలపడంపై తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్‌లోని బుధవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ నాయకులు కలిశారు. ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. జూలై 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 2.543 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని.. దీంతో విద్యుత్ ఉద్యోగుల డీఏ గతంలో ఉన్న 19.272 శాతం నుంచి 21.815 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు సంబంధించిన వివిధ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడంతో ఉప ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సెలవులు, గ్రాట్యుటీ, పదోన్నతులు తదితర సమస్యలపై దృష్టి సారించాలని టీజీ ట్రాన్స్‌కో, టీజీ జెన్‌కో, రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు భట్టి ఆసక్తి చూపడంపై హర్షం వ్యక్తం చేశారు.
‎
‎ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగి 20,018 మెగావాట్లకు పైగా గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంలో ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కమ్‌ల ఇంజినీర్లు, ఉద్యోగులు, ఆర్టిజన్లు సమష్టిగా చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. రైతులు, గృహ వినియోగదారులు, పారిశ్రామిక సంస్థలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన విద్యుత్ సిబ్బంది సేవలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసించారు.
‎
‎విద్యుత్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి పీఆర్‌సీ-2026 ప్రక్రియను వేగవంతం చేయాలని జేఏసీ నాయకులు కోరారు. వారి విజ్ఞప్తికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించి.. చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ‎రానున్న రబీ సీజన్‌లోనూ రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా జరిగేలా విద్యుత్ రంగ ఉద్యోగులందరూ అంకితభావంతో పనిచేస్తారని హామీ ఇచ్చినట్లు జేఏసీ కోఆర్డినేటర్ పరికె సదానందం తెలిపారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ శ్రీధర్, జేఏసీ ప్రతినిధులు వెంకటేశ్వర్లు, వజీర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  

ZEENEWS TRENDING STORIES