Mla Anirudh Reddy: నిధుల కోసం చావుకైన సిద్దమే.. సీఎం రేవంత్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సెన్సెషనల్ కామెంట్స్..
Anirudh reddy fires on cm revanth reddy: నాగర్‌కర్నూల్‌లో కాంట్రాక్టర్ మరణిస్తే రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారని మరీ.. జడ్చర్లలో తాను మరణిస్తే బిల్లులు ఇస్తారా..?.. దీని కోసం చావడానికైనా సిద్ధమంటూ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Jadcherla mla Anirudh reddy fires on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎల్ నినో అంశంపై బీఆర్ఎస్ , కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల మంటలు పీక్స్ కు చేరాయి. మరోవైపు నేతలు తరచుగా కాంగ్రెస్ నేతలు తరచుగా పార్టీ తీరుపై బహిరంగంగానే విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతే కాకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డి సైతం కొన్ని నెలల క్రితం తన నియోజక వర్గంకు నిధులు ఇవ్వడంలేదని, సీఎంకు చెప్పిన, మంత్రులకు పలుమార్లు ఫోన్ చేసిన తన కాల్ ను ఆన్సర్ చేయడంలేదన్నారు.
ఈ క్రమంలో నిధులను విడుదల చేయక పోవడం వల్ల అనేక డెవలప్ మెంట్ పనులు ఆగిపోయాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాజాగా.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు.
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల విడుదలలో జాప్యంపై తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. మంత్రుల నియోజకవర్గాలకే బిల్లులు చెల్లిస్తారా అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిధులు విడుదల చేయకపోతే 30 వేల మందితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు.
అదే విధంగా.. నాగర్‌కర్నూల్‌లో కాంట్రాక్టర్ మరణిస్తే రూ.5 కోట్ల బిల్లు ఇచ్చారని, జడ్చర్లలో చనిపోతేనే బిల్లులు ఇస్తారా? దీని కోసం తాను చావడానికైనా సిద్ధమంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జడ్చర్లలో పూర్తయిన, కొనసాగుతున్న పనులకు బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సాగునీటి కోసం పార్టీలకు అతీతంగా పోరాడతానని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సొంత ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. దీనిపై బీఆర్ఎస్ సైతం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది.