• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం

Telangana Govt Takes Big Decision On Kaleshwaram Project Restoration: కాళేశ్వరం ప్రాజెక్టుపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ ప్రాజెక్టుపై యూటర్న్‌ తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 27, 2026, 08:20 AM IST|Updated: Sep 27, 2026, 08:24 AM IST
joinshare
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం యూటర్న్‌.. రిపేర్లు చేయాలని నిర్ణయం
Image Credit: Kaleshwaram Project Restoration

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kaleshwaram Project Restoration: తెలంగాణకు వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు కూలిపోయింది.. పనికిరాదని తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టును పునరుద్ధరించాలని నిర్ణయించింది. నవంబర్‌ రెండోవారంలో  కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రకటించారు. 2027 వర్షాకాలానికి ముందే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని తెలిపారు.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల సమగ్ర పునరుద్ధరణ పనులు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌ రెండోవారంలో  ప్రారంభించి, 2027 వర్షాకాలానికి ముందే పూర్తి చేస్తామని ప్రకటించారు. మూడు బ్యారేజీల భద్రతను పటిష్టం చేయడంతోపాటు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు.

హైదరాబాద్‌ బేగంపేట కుందన్‌ బాగ్‌లోని అధికారిక క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ప్రతిపాదనలపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు డిజైనర్‌ రూపొందించిన పునరుద్ధరణ ప్రణాళికలో గ్రౌటింగ్‌ ద్వారా పునాదులను బలోపేతం చేయడం, స్టిల్లింగ్‌ బేసిన్లను పొడిగించడం, కొత్తగా కట్‌-ఆఫ్‌ వాల్స్‌ నిర్మించడం వంటి కీలక పనులపై చర్చించారు. గోదావరి వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించే ఏర్పాట్లలో ఉన్న లోపాలను సరిచేయడంతోపాటు పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, పునాదుల కింద నీటి చొరబాటును అరికట్టడం ఈ పనుల ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు.

ఎన్‌డీఎస్‌ఏతోపాటు ఇతర నిపుణుల కమిటీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకొని కాళేశ్వరం పునరుద్ధరణ ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. బ్యారేజీల నిర్మాణ భద్రత, పునరుద్ధరణ పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. శాస్త్రీయ అధ్యయనాలు, జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల సిఫార్సుల ఆధారంగానే ప్రతి పని జరుగుతుందని తెలిపారు.

'ప్రతిపాదిత డిజైన్లను పుణేలోని కేంద్ర జల, విద్యుత్‌ పరిశోధనా కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌)లో కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నాం. వివిధ స్థాయిల్లో వరద ప్రవాహం ఉన్నప్పుడు బ్యారేజీల వద్ద నీటి ప్రవాహ తీరు ఎలా ఉంటుందో, ప్రతిపాదించిన చర్యలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఖరారు చేసిన డిజైన్లను అక్టోబర్‌ 5న న్యూఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచుతాం' అని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.  సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను ఏకకాలంలో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

'డిజైన్లకు అనుమతి లభించిన వెంటనే టెండర్లను పిలిచి, పనులను అప్పగించేలా మొత్తం ప్రక్రియను వేగవంతం చేయాలి. పనుల అమలులో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు, స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని ఆదేశించారు. నిర్ణీత గడువులో పనులు పూర్తయ్యేలా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలి' అని అధికారులకు మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా సాంకేతికంగా పటిష్టమైన, దీర్ఘకాలం పటిష్టంగా ఉండే విధానాలతో మూడు బ్యారేజీలను పునరుద్ధరించడమే తమ లక్ష్యమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Hyderabad