Hyderabad: ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కీసర డిప్యూటీ ఎమ్మార్వో.. హైదరాబాద్ లో కలకలం.!.
Acb attacks on keesara govt office: రూ 2.50 లక్షల లంచం తీసుకుంటూ ACB అధికారులకు కీసర డిప్యూటీ తహసీల్దార్ దొరికిపోయాడు. దీంతో పోలీసులు ఆఫీసుల్లో, ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు.
Keesara deputy tahsildar caught by acb while taking bribe: ఇటీవల కొంత మంది ప్రభుత్వ అధికారులు తరచుగా లంచాలు తీసుకుంటు అడ్డంగా దొరికిపోతున్నారు. సర్కారు ఆఫీసుల వచ్చేవారి నుంచి లంచాల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. చేతికి డబ్బులు ఇవ్వందే కొంత మంది పనులు చేయమని, ఫైళ్లు ముట్టమని తెగేసి చెబుతున్నారు. ఇలాంటి ఘటనల్లో కొంత మంది లంచాలు డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. దీంతో ఏసీబీ దాడుల్లో అక్రమార్కులు అడ్డంగా దొరికిపొతున్నారు.
అయితే.. ఎంత మంది అవినీతి అనకొండలు అడ్డంగా దొరికిపోయిన కొంతమంది అధికారుల్లొ మాత్రం ఇంకా మార్పులు రావడం లేదు. ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ 20లక్షలను లంచంగా తీసుకుంటూ ఆఫీసులో దొరికిపోయారు. ఈ ఘటన మరువక ముందే కీసరలో మరో డిప్యూటీ ఎమ్మార్వొ లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు.
మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డిరూ 2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. తన భూమిని 22A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు రూ.5 లక్షలను డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి డిమాండ్ చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. బాధితుడు వెంటనే ఏసీబీని ఆశ్రయించాడు.
ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ముందస్తుగా వలపన్ని ఎమ్మార్వొ ఆఫీసులో తొలివిడతగా రూ 2.50 లక్షల లంచంను ఇస్తుండగా డిప్యూటీ ఎమ్మార్వొను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆఫీసులు, ఆయన ఇంటిలో ఏసీబీ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తుంది. ఈ ఘటనతో మరోసారి ప్రభుత్వ అధికారుల లంచాల ఘటన కాస్త వార్తలలో నిలిచింది.