Bank holidays in October 2026: సాధారణంగా మనం లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్తుంటాం.ఖాతాదారులకు ఏదైనా సమస్య వచ్చినా లేదా పెద్ద మొత్తంలో చెక్కులు, డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ చేయాలన్నా బ్యాంకులకు వెళ్లాల్సిందే. ప్రతి ఆదివారంతో పాటు, రెండో, నాలుగో శనివారాలు కూడా బ్యాంకులు మూసివేస్తారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంక్ బ్రాంచ్లకు వర్తిస్తుంది. వీటితో పాటు కొన్ని స్థానిక పండుగలకు కూడా బ్యాంకులు సెలవు ఇస్తాయి. కాబట్టి మీ ఏరియాలో బ్యాంక్ బ్రాంచీలు అందుబాటులో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకుని వెళ్లడం మంచిది.
ఈ అక్టోబర్ నెలలో దసరా, దుర్గాపూజ, లక్ష్మీ పూజ, కార్వా చౌత్ వంటి పండుగలు ఉండటంతో, అక్టోబర్ 15 నుండి 31 వరకు దేశవ్యాప్తంగా 10 రోజుల పాటు బ్యాంకులు సెలవుల్లో ఉన్నాయి.
ఈ సెలవులు ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలతో పాటు స్థానిక పండుగలను బట్టి ఉంటాయి. అయితే, ఈ పండుగ సెలవులు కేవలం స్థానిక బ్రాంచ్లకు మాత్రమే వర్తిస్తాయి. మీ నగరంలో బ్యాంకులు ఓపెన్ ఉన్నాయా లేదా అనేది సరిచూసుకోండి. అక్టోబర్ 17, 18, 19వ తేదీల మధ్య అగర్తలా వంటి ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. మూడో శనివారం అయినప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. అక్టోబర్ 18న ఆదివారం కావడంతో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇక 19వ తేదీన ఆయుధ పూజ సందర్భంగా కోహిమా, ఇటానగర్, గౌహతి, చెన్నై, అగర్తలా, ఐజ్వల్, భువనేశ్వర్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులు పనిచేయవు.
అక్టోబర్ 20, 21న విజయదశమి సెలవుల నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూసి ఉంటాయి. అక్టోబర్ 22 నుండి 25 వరకు సిక్కింలో సెలవులు ఉన్నాయి, ఇందులో నాలుగవ శనివారం, ఆదివారం వరుసగా వస్తాయి. అక్టోబర్ 26న అగర్తలా, చండీగఢ్, జమ్మూ వంటి ప్రాంతాల్లో లక్ష్మీదేవి పూజ నేపథ్యంలో స్థానికంగా సెలవు ఉంటుంది. అలాగే అక్టోబర్ 29న కార్వాచౌత్ సందర్భంగా సిమ్లాలో బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో ఎక్కడా బ్యాంక్ సెలవులు ప్రకటించలేదు.
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ, యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు ఇతర చెల్లింపులు చేసుకోవచ్చు. అయితే, పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా చేయాలన్నా, చెక్కులు డిపాజిట్ చేయాలన్నా లేదా డ్రాఫ్ట్ల కోసం బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాల్సిందే.