SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఖైరతాబాద్ బడా గణేశ్ నిమజ్జనానికి సర్వం సిద్ధం..

Khairthabad Bada Ganesh Nimmajjanam: ఖైరతాబాద్ బడా గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అర్చకులు ఉదయం 5 గంటలకు స్వామివారికి పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం అవుతుందని నిర్వాహకులు తెలిపారు. గణేష్‌ మండపం నుంచి టస్కర్‌ వాహనంపై శోభాయత్ర ప్రారంభం అవుతుంది.

Written By TA Kiran Kumar Sharma
Published: Sep 25, 2026, 08:51 AM IST | Updated: Sep 25, 2026, 08:56 AM IST
Image Credit: ZEE Telegu News
Join

Bada Vinayak Immersion:ఖైరతాబాద్ పెద్ద వినాయకుడు ఊరేగింపు సెన్సేషన్‌ థియేటర్‌, రాజ్‌దూత్‌ చౌరస్తా, టెలిఫోన్‌ భవన్‌, ఇక్బల్‌ మినార్, తెలంగాణ తల్లి చౌరస్తా మీదుగా, లుంబినీ పార్క్‌ పక్కన ఉన్న ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా  శోభయాత్ర సాగనుంది. బడా గణేష్‌ నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మధ్యాహ్నం 12 గంటల్లోపే నిమజ్జనం కార్యక్రమం పూర్తి చేయాలనే లక్ష్యంగా అధికారులు పనిచేస్తున్నారు. 69 అడుగుల ఖైరతాబాద్‌ గణేష్‌ నిమజ్జనం కోసం లాంగ్‌ బూమ్‌ మెకానికల్‌ క్రేన్‌ను ఏర్పాటు చేశారు. వినాయక్ సాగర్‌లో స్వామివారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు.ఖైరతాబాద్ గణేశుని నిమజ్జన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి.

వినాయక నిమజ్జనం సందర్బంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు..

ఈ మేరకు ఈ రోజు  ఉదయం 6 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ ఆంక్షలు అమలు కానున్నాయి. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అయితే.. విగ్రహాలను తరలించే వాహనాలకు మాత్రమే ప్రధాన ఊరేగింపు మార్గంలో అనుమతి ఉంటుందని. మిగతా వాహనదారులంతా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

మధ్నాహ్నం 12 గంటలకు సాగర తీరానికి ఖైరతాబాద్ వినాయకుడు..

ఖైరతాబాద్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు శోభాయాత్ర...మధ్యాహ్నం 12 గంటలకు సాగర్ తీరానికి బడా గణేష్‌ చేరుకోనుంది.  మహాగణపతి నిమజ్జనానికి క్రేన్ నంబర్-4 సిద్ధంగా ఉంచి అధికారులు.  మహ్నం 1:30 గంటలలోపు నిమజ్జనం పూర్తి చేయనున్నారు.  శోభాయాత్ర మార్గంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

హైదరాబాద్‌లో గణేష్‌ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు. 28 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.  10 వేల సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. ట్యాంక్‌ బండ్ చుట్టూ 100 హైరైజ్‌ కెమెరాలు.  24 డ్రోన్లతో టెక్నికల్ నిఘా ఏర్పాటు చేశారు. వినాయక్ సాగర్  చుట్టూ 40కి పైగా క్రేన్లు. బాలాపూర్ నుంచి సాగర్ వరకు 18 కి.మీ. యాత్ర ప్రారంభం కానుంది.  ఈ రోజు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES