• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Kirana Merchant Fraud: రూ.5 కోట్ల మోసం.. మహిళా పారిశ్రామికవేత్తపై కిరాణా వ్యాపారి లైంగిక దాడి!

Kirana Merchant Fraud: రూ.5 కోట్ల మోసం.. మహిళా పారిశ్రామికవేత్తపై కిరాణా వ్యాపారి లైంగిక దాడి!

Kirana Merchant Fraud Rs 5 Crores To Women Businessman: ముంబైకి చెందిన మహిళా పారిశ్రామికవేత్తను హైదరాబాద్‌కు చెందిన ఓ కిరాణా వ్యాపారి లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా రూ.5 కోట్ల మోసం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 15, 2026, 17:18 IST|Updated: Nov 15, 2026, 17:25 IST
joinshare
Kirana Merchant Fraud: రూ.5 కోట్ల మోసం.. మహిళా పారిశ్రామికవేత్తపై కిరాణా వ్యాపారి లైంగిక దాడి!
Image Credit: women industrialist harassment

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Women Businessman Fraud: ఓ మహిళా పారిశ్రామికవేత్తతో వ్యాపారం చేసిన కిరాణా వ్యాపారి ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను పలుమార్లు హైదరాబాద్‌కు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా వ్యాపార లావాదేవీల పేరుతో రూ.5.09 కోట్లకు పైగా మోసం చేశాడు. తనను రూ.కోట్లలో మోసం చేయడమే కాకుండా లైంగిక దాడి చేసిన కిరాణా వ్యాపారిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది.

తనకు బకాయిపడిన డబ్బులు అడిగిన ప్రతిసారీ ప్రేవేట్‌ ఫొటోలను బయటపెడతానంటూ బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ముంబైలో దిగుమతి వస్తువుల ట్రేడింగ్‌, బ్రోకరేజ్‌ వ్యాపారం నిర్వహిస్తున్న మహిళతో 2024 జూలైలో హైదరాబాద్‌ కిరాణా మర్చంట్స్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీగా మనీశ్‌ భాటి పరిచయం చేసుకున్నాడు. తొలుత పిస్తా, ఆ తర్వాత లవంగాల వ్యాపారం చేశాడు. మొదట సకాలంలో చెల్లింపులు చేసిన మనీశ్‌... 2024 నవంబరు నుంచి బకాయిలు చెల్లించడంలో జాప్యం చేశాడు. ఈ క్రమంలో తన సోదరుడు పవన్‌ భాటితో పాటు మహ్మద్‌ రషీద్‌, జీషాన్‌ అహ్మద్‌, నదీమ్‌ జుమానీ, ఇర్ఫాన్‌ భాడాలను ఆమెకు పరిచయం చేశాడు. వీరంతా కలిసి వివిధ వ్యాపార సంస్థల పేర్లతో ఆమె వద్ద నుంచి సరుకులు తీసుకుంటూ భారీగా బకాయిలు పెట్టారు.

మరోవైపు బకాయిలు అడిగినప్పుడల్లా మనీశ్‌ భాటి ప్రేమ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చేవాడు. తాను అవివాహితుడినని ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి హైదరాబాద్‌కు రావాలని పలుమార్లు ఆహ్వానించాడు. వీడియో కాల్స్‌ సందర్భంగా ఆమెకు తెలియకుండా ఆమె ప్రైవేట్‌ భాగాలను, అర్ధనగ్న చిత్రాలను రికార్డు చేశాడు. గత ఏడాది ఆగస్టు 5న హైదరాబాద్‌కు వచ్చిన ఆమెను తన హోటల్‌ గదికి వెళ్లి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం సెప్టెంబరు 9, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని వేర్వేరు హోటళ్లలో మద్యం తాగాలని బలవంతం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బకాయిలు చెల్లించాలని సదరు మహిళ కోరగా తన వద్ద ఉన్న ఆమె ప్రైవేట్‌ ఫొటోలను వ్యాపారులందరికీ పంపిస్తానని మనీశ్‌ బెదిరించాడు.

ఈ ఘటనపై బాధితురాలు తొలుత ముంబైలోని మహిమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, జీరో ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ నమోదు చేసి ఈ నెల 13న పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు. వివిధ వ్యాపార లావాదేవీల ద్వారా మొత్తం రూ.5,09,81,914 బకాయి ఉన్నట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. మనీశ్‌ భాటి వ్యాపార సంస్థల పేర్లపై రూ.1.67 కోట్లు, ఇర్ఫాన్‌ భాడాకు రూ.1.97 కోట్లు, నదీమ్‌ జుమానీకి రూ.1.17 కోట్లు, జీషాన్‌ అహ్మద్‌కు రూ.25.79 లక్షలు, పవన్‌ భాటికి రూ.6.25 లక్షలు బకాయి ఉన్నట్లు వివరించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Crime News
Telugu News
Hyderabad
Telangana News