• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Rajagopal Reddy: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.!. సీఎం రేవంత్ టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి సంచలన ట్విట్..

Rajagopal Reddy: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.!. సీఎం రేవంత్ టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి సంచలన ట్విట్..

Rajagopal Reddy fires on cm Revanth: మునుగొడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని ఏకీపారేశారు. సీఎంగా ఉండి ఆయన మాట్లాడుతున్న భాష ఏంటని అడిగినట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేవలం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజక వర్గాలకు మాత్రమే నిధుల్ని తీసుకెళ్లడం ఏంటని సెటైర్లు వేశారు.

Written ByInamdar Paresh
Published: Nov 20, 2026, 12:20 IST|Updated: Nov 20, 2026, 12:29 IST
joinshare
Rajagopal Reddy: అధికారం ఉందని రెచ్చిపోవద్దు.!. సీఎం రేవంత్ టార్గెట్‌గా రాజగోపాల్ రెడ్డి సంచలన ట్విట్..
Image Credit: komatireddyrajagopalreddy(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajagopal reddy fires on cm revanth reddy: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల తన నియోజక వర్గంకు నిధుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై యుద్దం ప్రకటించారని చెప్పుకొవచ్చు. ఎక్కడ చాన్స్ దొరికిన కూడా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పదునైన విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి విషయంలో సైతం కాంగ్రెస్ మోసం చేసిందని అనేక సందర్బాల్లో వాపోయారు.  తనకు మంత్రి పదవి లేకున్న మంత్రి, సీఎం కన్నా కూడా తానే పవర్ ఫుల్ లీడర్ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇటీవల సీఎం రేవంత్ మాట్లాడుతున్న భాషపై రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 

ఒక సీఎం స్థాయిలో ఉండి పండబెట్టి తొక్కుతా.. అనడం, ఆ భాష ఏంటని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని నియోజక వర్గాల్ని సమానంగా డెవలప్ మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రుల నియోజక వర్గాలకు మాత్రమే నిధులు కేటాయించడం ఏంటని నిలదీశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సైతంఇన్ డైరెక్ట్ గా సిద్దిపేట్ సభలో రియాక్ట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. కొంత మంది తమ పార్టీ నేతలు వెర్రీకుక్కలు కరిచినట్లు మైక్ ల ముందు మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి పంచ్ లు వేశారు. వారికి కార్యకర్తలు, ప్రజలు బుద్ది చెబుతారంటూ ఏకీపారేశారు.  మరోవైపు కోమటి రెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ పై, కాంగ్రెస్ మంత్రులపై సెటైరికల్ ట్విట్ చేశారు.

ఎమ్మెల్యే కోమటి రెడ్డి మరోసారి కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. సీఎం పదవి ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడటం సబబు కాదన్నారు. నిధులు ఎలా ఖర్చుచేయాలి.. ఎలా పాలించాలో తెలుసుకొవాలన్నారు. ఇలాంటి వాటిని ప్రజలు హర్షించరని తెలుసుకొవాలన్నారు.
అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం మానుకొవాలన్నారు. ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని గుర్తు పెట్టుకొవాలని ఎద్దేవా చేశారు.

ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన అందించాలన్నారు.  కాంగ్రెస్ ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నట్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్ వేదికగా సంచలన ట్విట్ చేశారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి అంశంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీరియస్ గా మాట్లాడారు.  పీసీసీ అన్ని నిశితంగా గమనిస్తుందన్నారు. మరోవైపు కోమటిరెడ్డి బ్రదర్స్ బ్లాక్ మెయిల్ రాజకీయాలని, వారికి కాంట్రక్ట్ లు ఇస్తే మళ్లీ జై రేవంత్, కాంగ్రెస్ అంటారని  బీఆర్ఎస్ నేతలు పంచ్ లు వేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News
Revanth Reddy