SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

KTR Chit Chat: సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదు?: కేటీఆర్‌

KT Rama Rao Questions Why Not Telangana Chapter Not There In Sonia Gandhi Book: తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ప్రకటించుకునే కాంగ్రెస్‌ నాయకులు మరి ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ విషయంతోనే తెలంగాణపై సోనియాకు, కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదనేది స్పష్టమవుతోందని తెలిపారు.

Written By Ravi Kumar Sargam
Published: Nov 17, 2026, 18:07 IST | Updated: Nov 17, 2026, 18:10 IST
Image Credit: KTR Chit Chat
Join

KT Rama Rao: కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ సోనియా గాంధీ ఆత్మకథపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణపై ఆమెకు, కాంగ్రెస్‌ పార్టీకి ప్రేమ లేదని తెలిపారు. 'సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదు? తెలంగాణపై ఆమెకు, కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదనే విషయం స్పష్టమవుతోంది' అని కేటీఆర్‌ చెప్పారు.

హైదరాబాద్‌లో మంగళవారం మీడియాతో జరిగిన మాజీ మంత్రి కేటీఆర్‌ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఎన్నికల ముందు అభయహస్తం.. ఎన్నికల తర్వాత రిక్తహస్తం అని కాంగ్రెస్‌ తీరును విమర్శించారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో సాధించింది శూన్యం, రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని స్పష్టం చేశారు. రంగుల కల చూపించి అన్ని వర్గాల ప్రజలని మోసం చేశారని.. హామీలను నెరవేర్చకపోగా తెలంగాణను అవమానించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు.

'గాంధీలను ప్రసన్నం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి బాడీగార్డ్‌లా వ్యవహరిస్తున్నారు. ఆత్మగౌరవం కోసం పోరాడిన గడ్డపై.. గులాముల్లా వ్యవహరించడం సిగ్గుచేటు' అని రేవంత్‌ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ కాదు.. తెలంగాణ ఫాలింగ్ అని తెలిపారు. మూడేళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. భారత్ సమ్మిట్‌తో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదని ప్రకటించారు. రాజకీయ సమ్మిట్ తప్ప రాష్ట్రానికి ఉపయోగపడిన కార్యక్రమం కాదని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు పేరు మారుస్తారనే వార్తలపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. 'కాళేశ్వరం ప్రజల ప్రాజెక్ట్. పేరు మార్చడం అంటే సిగ్గుచేటు. మూడేళ్లలో ప్రాజెక్టును పండబెట్టారు. ఆయన పేరు మారిస్తే మేము వచ్చాక మేము మారుస్తాం. ప్రాజెక్టులకు ఎక్కడ కేసీఆర్ పేరు పెట్టుకోలేదు. దేవుళ్ల పేరు పెట్టుకున్నాడు. పేరు మార్చి శునకానందం పొందుతున్నారు' అని విమర్శించారు. 'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మీలాగా పేరు పెట్టలేదు. నాయకుల పేర్లు పెట్టలేదు కదా! దైవక్షేత్రం పేరు కాళేశ్వరం అని పెట్టారు. ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీకి పుట్టబోయే కొడుకు పేరు పెట్టలేదు కదా!?' అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తరవాత కాంగ్రెస్ నాయకులు పేర్లు ఉంటే కచ్చితంగా మారుస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రసంగంలో ప్రజాస్వామ్యం మీద, మరి తెలంగాణలో ఎలా ఉందో తెలుసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులకు హితవు పలికారు. చిత్తశుద్ధి ఉంటే ఈ మూడేళ్లలో ఎన్ని సంస్థలు వచ్చాయి ఎన్ని కోట్లు వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

'ముఖ్యమంత్రిగా 119 నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు. జనం చూడరు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ నాయకుల పేర్ల మీద ఉన్న ప్రాజెక్టుల పేర్లు మారుస్తాం. 67 ఎకరాల్లో రైతులకు వచ్చిన నీళ్లు కేసీఆర్ కూడా వెళ్తున్నాయి. ఆయనకి ప్రత్యేకంగా వెళ్లడం లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

ZEENEWS TRENDING STORIES