• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /KT Rama Rao: నీళ్ల కోసం పోరాడిన రైతుల అరెస్ట్‌.. కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

KT Rama Rao: నీళ్ల కోసం పోరాడిన రైతుల అరెస్ట్‌.. కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం

KTR Fire On Revanth Reddy About Farmers Arrest By Police: నీళ్లు లేక తమ పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతూ ఆందోళన చేపట్టిన రైతులను పోలీసులు అరెస్ట్‌ చేయడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఖండించారు. రైతులతోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను అరెస్ట్‌పై పోలీసులపై మండిపడ్డారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 01:34 PM IST|Updated: Sep 21, 2026, 01:38 PM IST
joinshare
KT Rama Rao: నీళ్ల కోసం పోరాడిన రైతుల అరెస్ట్‌.. కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం
Image Credit: KT Rama Rao

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Palamuru Farmers Protest: ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటికే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా రైతులు సాగునీటి కోసం ఆందోళన చేపట్టారు. తమ పంటను కాపాడుకునేందుకు వీధి పోరాటానికి దిగారు. తమ పొలాలకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని కోరుతూ రైతులు భారీ ఎత్తున నిరసన చేపట్టగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. వారితోపాటు బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులను కూడా అరెస్ట్‌ చయేడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. రైతులు, గులాబీ పార్టీ నాయకుల అరెస్ట్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఖండించారు.

జూరాల ఆయకట్టుకు సాగునీరిచ్చి పంటలు కాపాడాలని రైతుల పక్షాన డిమాండ్ చేసిన ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సి.లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ పార్టీ నాయకుందరినీ అక్రమంగా నిర్బంధించడం రేవంత్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి నిదర్శనం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

'కళ్లముందే పంటలు ఎండిపోయి అల్లాడుతున్న అన్నదాతల గోసను ప్రభుత్వం తీర్చాల్సిందిపోయి.. న్యాయమైన డిమాండ్‌తో నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అణచివేసేందుకు రేవంత్ సర్కారు కుట్ర చేస్తోంది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. 'సీఎంగా విఫలమైన రేవంత్ రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి.. జిల్లాలోని అనేక మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలకు చీకటి  ఆదేశాలిచ్చాడు' అని తెలిపారు.

'జూరాల ప్రాజెక్టులో 9 టీఎంసీల నీటి లభ్యత ఉన్నా కూడా విడుదల చేయకుండా పనికిరాని కుంటిసాకులతో రేవంత్ సర్కార్‌ పచ్చని పంటల ఉసురు తీస్తోంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పంటలను కాపాడుకునే ఏకైక తపనతో గుండెపగిలిన రైతులు జూరాల గేట్లు ఎత్తే ప్రయత్నం చేస్తే.. వారిపై అక్రమ కేసులు బనాయించిన ప్రభుత్వం అన్నదాతలను అన్నివిధాలా అరిగోస పెడుతోందని మండిపడ్డారు.

తెలంగాణ గడ్డపై ఉన్న జూరాల ప్రాజెక్టు పరిసరాల్లోకి రైతులు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి, వందలాది పోలీసులను చుట్టుపక్కల మోహరించడం ముమ్మాటికీ సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తాగునీటికి కేవలం రెండు టీఎంసీలు సరిపోతాయని తెలిసినా.. 9 టీఎంసీలు ఉన్న జూరాల నుంచి చుక్క నీరు విడుదల చేయకుండా ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులను సంక్షోభంలోకి నెట్టడం క్షమించరాని పాపం అని రేవంత్‌ రెడ్డి తీరును కేటీఆర్‌ ఖండించారు.

అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రభుత్వం విడుదల చేయడంతోపాటు జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే రిలీజ్ చేయాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడం ఖాయం అని హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:
KTR