నేచురల్ స్టార్ నాని నటించిన 'ది పారడైజ్' సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందనను అందుకుంటోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా నిన్న సుదర్శన్ థియేటర్‌లో ఈ చిత్రాన్ని వీక్షించారు. ముఖ్యంగా ఈ సినిమాలో గులాబీ బాస్ కేసీఆర్ పాత్రను ప్రియదర్శి పోషించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల తాను కూడా ఈ సినిమా చూస్తానని చెప్పినట్లే, పార్టీ ముఖ్య నేతలతో కలిసి సుదర్శన్ థియేటర్‌లో సెకండ్ షోకు వెళ్లారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డితో పాటు పలువురు నేతలు కూడా హాజరయ్యారు.
అక్కడ అభిమానులు కేటీర్‌కు, బీఆర్ఎస్ శ్రేణులకు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. సినిమా చూసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ చిత్రం అస్తిత్వం కోసం ఆరాటపడి, చేసిన పోరాటాన్ని ప్రతిబింబిస్తోందని ట్వీట్ చేశారు. సందర్భం అనుకూలిస్తే గడ్డి పోచలు కూడా గడ్డపారలుగా మారుతాయనే సందేశాన్ని దర్శకుడు శ్రీకాంత్ అందించారని ఆయన అభినందించారు.
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు…— KTR (@KTRBRS) September 26, 2026
సినిమా వీక్షించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా కూడా పంచుకున్నారు. ఈ చిత్రం కేవలం వినోదం మాత్రమే కాదని, సామాజిక అణిచివేతపై జరిగిన ప్రజా పోరాటానికి అద్దం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సామాన్యులు సైతం విప్లవకారులుగా మారుతారనే అంశాన్ని దర్శకుడు చూపించిన తీరును కేటీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారు. అంతేకాకుండా, విప్లవాత్మక కథాంశంతో వచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఒదెలకు , నాని అద్భుత నటనకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Sudershan Theatre, RTC X Roads 🔥 https://t.co/slryMHJa7p pic.twitter.com/HcfHEg4NzS
— KTR News (@KTR_News) September 26, 2026
తెలంగాణ నేల యాస, భాష, సంస్కృతిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించారని, అణచివేతకు వ్యతిరేకంగా ఒక నాయకుడు ప్రజల పక్షాన నిలబడి ముందుండి నడిపించే తీరును చక్కగా చూపించారని అన్నారు. నిన్న థియేటర్‌కు వెళ్లే సమయంలో కూడా ఆయన, "చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు వెళ్తున్నాను. ఈరోజు రాత్రి నాకు ఇష్టమైన హీరో నాని, ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో వచ్చిన 'ది పారడైజ్' సినిమా చూడటానికి వెళ్తున్నాను" అని ట్వీట్ కూడా చేశారు కేటీఆర్.
St : #paradise 🐦⬛
Sudershan 35MM 🔥@KTRBRS https://t.co/IXAinVAGTR pic.twitter.com/7PoT2LmjB1— KTR News (@KTR_News) September 26, 2026
ఎప్పుడూ మంచి సినిమాలను ప్రోత్సహిస్తూనే ఉంటారు. ఈసారి థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూడటం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై విశేషమైన కామెంట్లు వస్తున్నాయి. ముఖ్య నేతలందరూ కలిసి థియేటర్‌లో సినిమా చూడటం అందరి దృష్టిని ఆకర్షించింది.