KTR Tweet: కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరు మారదు.. రాహుల్ గాంధీ పర్యటనపై కేటీఆర్ సంచలన ట్విట్..
ktr fires on cm revanth reddy: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పర్యటనపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాకుండా రెండు జాతీయ పార్టీల అగ్రనేతలకు తెలంగాణ నేతలు బాడీగార్డులుగా మారిపోయారని సెటైర్లు వేశారు.
ktr satirical tweet on cm revanth reddy and Telangana bjp leaders: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు బీజేపీ సైతం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తునే ఉంది. ఇప్పటికే ఎల్ నినో ప్రభావంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన సమయంలో బీజేపీ చీఫ్ రామ చందర్ రావ్ ఆయనకు శాలువు వేసి కాళ్లకు నమస్కరించడం రచ్చగా మారిన విషయం తెలిసిందే. తాజాగా.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇటీవల హైదరాబాద్ లోని ఏఐసీసీలో జరిగిన భారత్ సమ్మిట్ కార్యక్రమంకు హజరయ్యేందుకు వచ్చారు. దీనిలో భాగంగా గిగ్ వర్కర్లకు అండగా పలు ప్రకటనలు చేశారు.
ఈ క్రమంలో ర్యాలీలు, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీనిలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్కూటీపైన వెళ్తుంటే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకట స్వామిలు ఆయన వెంట పరిగెడుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అంతే కాకుండా వేదికపై కూడా సీఎం రేవంత్ రెడ్డి బాడీగార్డుగా అందర్ని పక్కకు నెట్టుకుంటూ ఎంపీ రాహుల్ గాంధీని వేదికమీద స్పీచ్ కు రూట్ క్లియర్ చేయడంపై కూడా తీవ్ర రచ్చ రాజుకుంది. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తనదైన స్టైల్లో సెటైర్లు వేశారు.
రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో .. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేకంగా బాడీగార్డులుగా మారారంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలకు వారి పదవులకు ఉన్న హుందాతనం కాపాడుకొవడం రాదని సెటైర్లు వేశారు. రాహుల్ గాంధీ వెనుక ఆ పరుగెత్తడం ఏంటని మండిపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చినప్పుడు కూడా బీజేపీ నేతలు ఇదే విధంగా చేశారన్నారు.
గతంలో బండి సంజయ్ చెప్పులు మోస్తే, ఇటీవల రామ చందర్ రావు అమిత్ షా కాళ్లకు దండం పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని జాతీయ పార్టీలైన కాంగ్రెస్ , బీజేపీ పార్టీ నేతల కాళ్ల మీద పడి ఇక్కడి నేతలు మన గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ , బీజేపీ నేతల తీరు తెలంగాణకు సిగ్గుచేటని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యంగా స్పందించారు.