• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా నెలకొన్న ఉద్రిక్తత.!.

Man died in Bheemgal police station: భీమ్ గల్ పోలీస్ స్టేషన్ లో నిప్పు పెట్టుకున్న సుధాకర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయనను తొలుత ఆర్మూర్ కు తరలించి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని హోప్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Written ByInamdar Paresh
Published: Oct 06, 2026, 10:20 AM IST|Updated: Oct 06, 2026, 10:29 AM IST
joinshare
Nizamabad: భీమ్ గల్ పోలీసు స్టేషన్ లో నిప్పుపెట్టుకున్న వ్యక్తి మృతి.. స్థానికంగా  నెలకొన్న ఉద్రిక్తత.!.
Image Credit: manburninbheemgalpolicestation

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
India bloc Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్..  పార్లమెంట్ నుంచి ఈసీకి  ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. భారీగా బలగాల మోహరింపు..

India bloc Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్.. పార్లమెంట్ నుంచి ఈసీకి ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. భారీగా బలగాల మోహరింపు..

2

ప్రపంప్రపంచ కప్ విజేత హర్మన్ ప్రీత్‌ సంచలన నిర్ణయం.. అన్నీ ఫార్మెట్ల నుంచి..!!

3

Snake Video: భారీ వాహనం టైర్‌లో చిక్కుకుని బుసలు కొడుతున్న పాము.. వీడియో వైరల్..

4

చైనాలో చంకలో వెంట్రుకలకు రంగులేసి.. సోషల్ మీడియాలో యువతుల కొత్త ఉద్యమం!

5

వపర్‌ఫుల్‌ నవపంచమి రాజయోగ ఎఫెక్ట్‌.. ఈ రాశుల వారికి కోరికలు నెరవేరి, పనుల్లో విజయాలే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man died while taking treatment after burn suicide attempt in bheemgal: పోలీసులు వేధింపులతో  నిజామాబాద్ జిల్లా భీమ్ గల్ పీఎస్ లో సుధాకర్ అనే వ్యక్తి ఆత్మాహత్యకు యత్నించాడు. అయితే.. ఆయన 90 శాతం గాయాలతో ఆర్మూర్ లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ లోని హోప్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ సుధాకర్ కు ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో  సుధాకర్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. 

తీవ్రంగా గాయాలు కావడంతో ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఇప్పటికే ఈ ఘటనపై  మాజీ మంత్రి , ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులపై తీవ్ర విమర్శలు చేశారు.  పోలీసులు వేధింపులతోనే సుధాకర్ సూసైడ్ కు పాల్పడ్డాడని ఇప్పటికే వీడియో రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో పోలీసు స్టేషన్ ఎదుట, భీమ్ గల్ లో రాస్తారోకో సైతం నిర్వహించి తమ నిరసనలు వ్యక్తం చేశారు. వెంటనే ఎస్సై తిరుపతిపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేశారు.

  పోలాస సుధాకర్ మృతిచెందడంతో భీమ్ గల్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది.  సుధాకర్‌కు నివాళులు అర్పించేందుకు  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బయలుదేరారు. దీంతో పోలీసులు ముందు జాగ్రత్తగా శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఇంట్లోనే ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు భీమ్ గల్ లో భారీగా బలగాలను మోహరించారు.

భీమ్‌గల్‌ పట్టణంలోని దేవాంగపల్లికి చెందిన పొలాస సుధాకర్‌  బస్టాండ్‌ సమీపంలో టీ కొట్టు పెట్టుకున్నాడు. అతను చాయ్‌, సిగరెట్లు, పాన్ మసాలాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.

 అయితే.. రాత్రి 10 తర్వాత కూడా విక్రయాలు సాగిస్తుండటంతో పోలీసులు అతనికి పలు మార్లు జరిమాన విధించారు. ఇక అతనిపై  పోలీసులు కేసు నమోదు చేయడంతో  తీవ్ర మనస్తాపంకు గురయ్యాడు. ఈ క్రమంలో నిన్న (సోమవారం) పీఎస్ కు వచ్చి పెట్రోల్  పోసుకుని ఆత్మహత్యకు  పాల్పడ్డాడు. ఈ ఘటన పోలీస్ డిపార్ట్ మెంట్ లో సైతం తీవ్ర దుమారంగా మారింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Crime News