• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • / Vemulawada: వినాయకుడి మెడలో నుంచి నోట్ల దండ మాయం.. దొంగకు బిగ్ షాక్ ఇచ్చిన వేముల వాడ యూత్ యువకులు.. ఏంచేశారంటే..?

Vemulawada: వినాయకుడి మెడలో నుంచి నోట్ల దండ మాయం.. దొంగకు బిగ్ షాక్ ఇచ్చిన వేముల వాడ యూత్ యువకులు.. ఏంచేశారంటే..?

Ganesh idol notes garland theft in vemulawada: బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద వినాయకుడి వద్ద అలంకరించిన భారీ నోట్ల దండను ఒక వ్యక్తి చోరి చెద్దామని అక్కడకు వచ్చాడు. అతను చుట్టుపక్కల ఎవరైన ఉన్నారా అని అటు ఇటు చూశాడు. వెంటనే నోట్లను తెంచేసి అక్కడి నుంచి పరారయ్యాడు. వేములవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 22, 2026, 16:31 IST|Updated: Sep 22, 2026, 16:39 IST
joinshare
 Vemulawada: వినాయకుడి మెడలో నుంచి నోట్ల దండ మాయం.. దొంగకు బిగ్ షాక్ ఇచ్చిన వేముల వాడ యూత్ యువకులు.. ఏంచేశారంటే..?
Image Credit: ganeshpuja(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Man steals rs 500 currency garland from ganesh idol in vemulawada: తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా గణేషుడి ఉత్సవాల్లో అనుకొని ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా మండాపాలలో గణపయ్యలను ప్రతిష్టాపన చేసుకుని చాలా మంది భక్తితో పూజలు చేసుకుంటున్నారు. కొంత మంది చేతిలో లడ్డులు, మెడలో నోట్ల కట్టల మాలలు వేసి తమ భక్తిని చాటుకున్నారు. వెరైటీ డెకొరేషన్ లు కూడా చేస్తున్నారు. అయితే.. కొంత మంది నోట్ల దండలపై కన్నేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన రాజన్న సిరిసిల్లాలో చోటు చేసుకుంది


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఒక గణపయ్య మండపలో చోరీ జరిగింది. బద్దిపోచమ్మ వీధిలోని వినాయకుడి విగ్రహం వద్ద జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది. జీవైసీ యూత్‌ ఆధ్వర్యంలో వినాయకుడికి 500 రూపాయల నోట్లతో రూ.50 వేల విలువైన దండను అలంకరించారు. ప్రతిరోజు దానికి యూత్ సభ్యులు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే.. ఇటీవల

తెల్లవారుజామున అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతని ప్రవర్తన అనుమానస్పదంగా ఉంది. అతను యూత్ సభ్యుల కళ్లు కప్పి గణపయ్య మెడలో ఉన్న నోట్ల దండను తెంచేసి వెంటనే అక్కడి  నుంచి పరారయ్యాడు. అతని వాలకంను అప్పటికే గమనించిన యూత్ సభ్యులు అతడిని వెంబడించారు. 

కొంతదూరం వెళ్లిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేశారు. మరల వినాయకుడి నోట్ల దండను తీసుకున్నారు. వెంటనే  పోలీసులకు సమాచారం అందించారు. నోట్ల దండను కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Karimnagar