Woman killed her husband over extra marital row in narayanpet: సమాజంలో కొంత మంది పవిత్రమైన వివాహ బంధాన్ని అపహస్యం చేస్తున్నారు. పెళ్లిళ్లు చేసుకుని అన్యోన్యంగా ఉండకుండా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీంతో కట్టుకున్న వారిని కాటికి పంపడమే పనిగా పెట్టుకున్నారు. కొన్ని చోట్ల భర్తలు తమ భార్యలను, మరికొన్ని చోట్ల భార్యలు తమ భర్తను మట్టుపెడుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. తెలంగాణలోని నారాయణ్ పేట్ లో ఇలాంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మరికల్ మండలం మద్వార్ గ్రామంలో ఉండే బాలస్వామి (46), తెలపల్లి రాములమ్మ దంపతులకు 28 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇటీవల బాలస్వామి స్థానికంగా ఉండే మరో మహిళతో ఎఫైర్ పెట్టుకున్నారు. ఇద్దరు కలసి తరచుగా రొమాన్స్ చేసుకునే వారు. ఈవిషయం కాస్త భార్య రాములమ్మకు తెలిసింది. భర్తను ఈ విషయంపై నిలదీసి ప్రవర్తన మార్చుకొవాలని గట్టిగానే చెప్పింది.
కానీ భర్త మాత్రం తన వంకర పనులను మానుకొలేదు. దీంతో ప్రతి రోజు భార్యభర్తల మధ్య వీరి అనైతిక బంధంపై గొడవలు జరుగుతుండేవి. ఇక విసిగిపోయిన రాములమ్మ సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి బాలస్వామి ఇంట్లో నిద్రిస్తుండగా అతని మీద పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో తీవ్ర గాయాలపాలైన అతగాడు మంటలతో బైటకు పరుగులు పెట్టాడు.
వెంటనే స్థానికులు అంబులెన్స్ కు, పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందించి, పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ బాలస్వామిచికిత్స పొందుతూ సెప్టెంబర్ 25న మృతి చెందాడు. ఈ ఘటనపై బాలస్వామి తరపు వారు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
రాములమ్మను అరెస్ట్ చేశారు. తన భర్త వివాహేతర సంబంధం వల్ల గొడవలు జరిగి హత్య చేసినట్లు మహిళ అంగీకరించింది. ఒకవైపు తండ్రి చనిపోవడం, తల్లికి జైలుకు వెళ్లడంతో పిల్లలిద్దరు అనాథలుగా మారారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది.