• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ఓపీఎస్ కోసం కదం తొక్కనున్న ఉద్యోగులు.. 17న సామూహిక సెలవు..!!

ఓపీఎస్ కోసం కదం తొక్కనున్న ఉద్యోగులు.. 17న సామూహిక సెలవు..!!

Telangana CPS Employees Protest: సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఓపీఎస్ తిరిగి అమలు చేయాలన్న ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.80లక్షల మంది ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అయ్యారు.

Written ByBhoomi
Published: Nov 15, 2026, 08:46 AM IST|Updated: Nov 15, 2026, 08:48 AM IST
joinshare
ఓపీఎస్ కోసం కదం తొక్కనున్న ఉద్యోగులు.. 17న సామూహిక సెలవు..!!
Image Credit: Telangana CPS Employees Protest

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

అదుర్స్‌కు సీక్వెల్‌గా ఎన్టీఆర్, అనిల్ రావిపూడి మూవీ ..?

2

కార్తీక మాసంలో దీపదానం ఎలా చేయాలి? ఎవరికి దానం చేస్తే పుణ్యఫలం కలుగుతుంది?

3

తెలంగాణకు తుఫాన్ ఎఫెక్ట్.. నవంబర్ 20 నుంచి 22 వరకు భారీ వర్షాలు.. ఈ 6 జిల్లాలకు అలర్ట్!

4

కార్తీక మాసంలో తులసి ముందు నెయ్యి దీపం ఎందుకు వెలిగిస్తారు? అసలు రహస్యం ఇదే!

5

పుతిన్ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్..నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana CPS Employees Protest: సీపీఎస్ ఉద్యోగులు ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఓపీఎస్ తిరిగి అమలు చేయాలన్న ఎన్నికల హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.80లక్షల మంది ఉద్యోగులు ఉద్యమానికి రెడీ అయ్యారు. ఈ నెల 17వ తేదీన మాస్ లివ్స్ ప్రకటించడంతో పాటు.. రాష్ట్రంలో మొత్తం 33 జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, నిరాహార దీక్షలు, సత్యాగ్రహాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అధికారికంగా ప్రకటించింది.

కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో OPSను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి మూడేళ్లు గడుస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడకపోవడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.  ప్రస్తుతం CPS విధానంలో రిటైర్మెంట్  పొందిన ఉద్యోగులకు నెలకు కేవలం రూ.1,500 నుంచి రూ.2,500 వరకు మాత్రమే పెన్షన్ వస్తోందని.. ఈ అరకొర మొత్తంతో జీవనం సాగించడం కష్టంగా మారిందని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి, ఓపీఎస్ పునరుద్ధరణపై ఒక నిర్దిష్ట కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ తమ ఉద్యమ కార్యాచరణ వివరాలను మీడియాకు వెల్లడించారు.

మరోవైపు.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విషయంలోనూ సీపీఎస్ ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోందని నాయకులు పేర్కొన్నారు. తమకు రావాల్సిన డీఏ బకాయిలు సకాలంలో అందడం లేదని వాపోయారు. అంతేకాకుండా, ఇప్పటికే పదవీ విరమణ పొందిన ఐదు వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులకు హెల్త్ కార్డులను వర్తింపజేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ యూనియన్ నాయకత్వంతో చర్చలు జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా, తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగ జేఏసీ నాయకత్వం వైఖరిపైనా సీపీఎస్ ఉద్యోగుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోందని వారు స్పష్టం చేశారు. 

Also Read: 

విద్యార్థుల పోరాటానికి దిగొచ్చిన తెలంగాణ సర్కార్.. పాలిటెక్నిక్ కళాశాలలు విద్యాశాఖలోనే కొనసాగింపు..!!

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
Employees