SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Ponnam Prabhakar: ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యత.. హైదరాబాద్‌లో కుండపోత వానలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు..

Heavy rains in hyderabad: ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా.. సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 14, 2026, 12:39 PM IST | Updated: Sep 14, 2026, 12:45 PM IST
Image Credit: ministerponnamonrainalert
Join

Ponnam prabhakar review with officials on heavy rainfall in Hyderabad: తెలంగాణలో అల్పపీడన ప్రభావంతో గత రెండు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గంటకు 40 నుంచి 50 మైళ్ల వేగంతో వానలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాలన్ని జలమయంఅయ్యాయి. ఎక్కడ చూసిన కూడా రోడ్లన్ని చెరువులను తలపిస్తున్నాయి. ఇక హైదరాబాద్ లో భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఇక వినాయక చవితి పండగ నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  

ఈ క్రమంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించారు.  హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా, వాటర్ వర్క్స్, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక అప్రమత్తత పాటించాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాలు, నిమజ్జన ప్రాంతాలు, రహదారులు, లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, డీ-సిల్టింగ్ పూడిక, డెబ్రిస్‌ను వెంటనే తొలగించాలని సూచించినట్లు వెల్లడించారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, ఎయిర్‌టెక్‌ యంత్రాలను సిద్ధంగా ఉంచి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు.

అధికారులు కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రజల భద్రతే మన తొలి ప్రాధాన్యత అని తెల్చి చెప్పారు.
 

Add Zee News as a Preferred Source

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES