SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Minister Seethakka: తెలంగాణ మహిళలు ఎగిరిగంతేసే వార్త .!. కీలక ప్రకటన చేసిన మంత్రి సీతక్క.. అసలు విషయం ఏమిటంటే..?..

Minister seethakka key announcement: మహిళలు చదువుకుంటే వారికి మరిన్ని ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి సీతక్క పేర్కొన్నారు. విద్య అనేది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందన్నారు. అందుకే అక్కచెల్లెమ్మలంతా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు.

Written By Inamdar Paresh
Published: Sep 29, 2026, 07:00 PM IST | Updated: Sep 29, 2026, 07:06 PM IST
Image Credit: ministerseethakkaspeechonwomeneducation
Join

Minister seethakka good news to Telangana women on Education: తెలంగాణాలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలపై వరుసగా వరాల జల్లును కురిపిస్తుంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంను కల్పిస్తున్నారు. తాజాగా.. మంత్రి సీతక్క మహిళలకు మరల చదువుకునే అవకాశంను కల్పించింది. ముఖ్యంగా ..‘అమ్మకు అక్షరమాల’ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళలు చదవడం, రాయడం, లెక్కలు చేయడం నేర్చుకున్నారని, వారిలో అనేక మంది ఉల్లాస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని మంత్రి సీతక్క తెలిపారు. 

అక్షరాస్యత సాధించిన మహిళలకు ఇకపై 10వ తరగతి పరీక్షలు రాసే అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఇక మహిళలు ఎవరైన,
ఏ కారణంతోనైనా తమ చదువును మధ్యలో ఆపేసి ఉంటే, మళ్లీ చదువుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.

మహిళలను కేవలం ఆర్థికంగా మాత్రమే కాకుండా విద్య, నైపుణ్య రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. తన జీవితమే ఇందుకు ఉదాహరణ అని, వివిధ కారణాలతో నిలిచిపోయిన తన చదువును తిరిగి కొనసాగించకపోయి ఉంటే నేడు ఈ స్థాయిలో ఉండే అవకాశం ఉండేది కాదని ఆమె అన్నారు.

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంటి దగ్గర నుంచే 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యను కొనసాగించే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. కుటుంబ బాధ్యతలు, పనులు చూసుకుంటూనే మహిళలు చదువును కొనసాగించవచ్చని కీలక ప్రకటన చేశారు.

ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు. మహిళలు చదువుకుంటే వారికి మరిన్ని ఆర్థిక అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. విద్య మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందుకే అక్కచెల్లెమ్మలంతా 10వ తరగతి పరీక్షలు రాసేందుకు ముందుకు రావాలి” అని మంత్రి పిలుపునిచ్చారు.

దగ్గరలోని మీ సేవా కేంద్రాలు, TOSS కేంద్రాలు లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సంవత్సరం ప్రతి మండలం నుంచి కనీసం 100 మంది మహిళలు 10వ తరగతి పరీక్షలు రాసేలా ప్రోత్సహించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను మంత్రి కోరారు.

చదువుకు వయసుతో సంబంధం లేదు. 14 ఏళ్లైనా, 40 ఏళ్లైనా చదువును కొనసాగించవచ్చని, చదువుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి మహిళకు ప్రభుత్వం అండగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఒక్క అడుగు ముందుకు వేస్తే చాలు.. ఆగిపోయిన చదువును మళ్లీ కొనసాగించవచ్చు. 

మీ కోసం వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చదువును పూర్తి చేసుకోండి. మీ చదువు మీకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అంతే కాకుండా.. ఆగిపోయిన చదువును మళ్లీ ప్రారంభించి, విద్యతో కొత్త అవకాశాలకు బాటలు వేసుకోవాలని మహిళలకు మంత్రి సీతక్క పిలుపునిచ్చారు

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES