SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Siddipet: సిద్దిపేట్‌లో దసరా రోజు ఘోరం.. మైనర్ బాలికపై సాముహిక అత్యాచారం.. ఆలస్యంగా బైటపడ్డ ఘటన .!.

Girl gang raped siddipet: దసరా పండగ రోజు మైనర్ బాలికను మరో గ్రామానికి తీసుకెళ్లిన నిందితులు సాముహిక అత్యాచారంకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Written By Inamdar Paresh
Published: Oct 23, 2026, 10:15 AM IST | Updated: Oct 23, 2026, 10:26 AM IST
Image Credit: Telangananews(file)
Join

Minor Girl gang raped in siddipet: ప్రభుత్వాలు ఎన్నికఠిన చర్యలు తీసుకున్న కామాంధుల్లో మార్పులు రావడం లేదు. ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. పసిపాప నుంచి పండు ముసలి వరకు అందరు వేధింపులకు గురౌతున్నారు. ముఖ్యంగా మైనర్ లపై దాడులు,  అత్యాచారాలపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన కూడా నేరస్థుల్లో భయం మాత్రం ఉండటంలేదు. 

సోషల్ మీడియా ప్రభావం, ఆన్ లైన్ లో ఆశ్లీల వీడియోలను చూసి కొంత మంది ఉన్మాదులగా మారుతున్నారు. వీరిలో మైనర్ లు కూడా ఉండటంతో సమాజం ఎటుపోతుందని అందరు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సిద్దిపేట్ జిల్లాలో ధూల్మిట్ట మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల బాలికపై ఏడుగురు అత్యాచారానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దసరా పండగ రోజు బాలికను మరో గ్రామానికి తీసుకెళ్లి, మరుసటి రోజు ఉదయం గ్రామంలో వదిలేసినట్లు చెప్పారు.  

ఈ క్రమంలో బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఏడుగురిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దారుణంకు పాల్పడిన వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదకరంగా మారింది. మరోవైపు గ్రామంలో గొడవలు జరక్కుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు సీసీ ఫుటేజీని జల్లెడపడుతున్నారు.

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES