• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Para Asian Games: పారా ఆసియా గేమ్స్‌లో భారత్ సరికొత్త రికార్డు.. తొలిసారి 100కి పైగా పతకాల కైవసం!

Para Asian Games: పారా ఆసియా గేమ్స్‌లో భారత్ సరికొత్త రికార్డు.. తొలిసారి 100కి పైగా పతకాల కైవసం!

Para Asian Games India Medal Tally: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతమైన ప్రదర్శనతో సరికొత్త చరిత్ర సృష్టించారు. పోటీలలో భారత్ 100కి పైగా పతకాలను కొల్లగొట్టి ప్రస్తుతం పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కేవలం అథ్లెటిక్స్ విభాగంలోనే సగానికి పైగా పతకాలు దక్కాయి. ట్రాక్ అండ్ ఫీల్డ్, షూటింగ్, బ్యాడ్మింటన్, ఆర్చరీలలో అంతర్జాతీయ రికార్డులను తిరగరాస్తూ భారత పారా క్రీడాకారులు పసిడి పతకాలతో మెరిశారు.

Written ByHarish Darla
Published: Oct 23, 2026, 11:54 AM IST|Updated: Oct 23, 2026, 11:56 AM IST
joinshare
Para Asian Games: పారా ఆసియా గేమ్స్‌లో భారత్ సరికొత్త రికార్డు.. తొలిసారి 100కి పైగా పతకాల కైవసం!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
YS Jagan:  ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా  వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan: ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేశారు.. చంద్రబాబు టార్గెట్‌గా వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు..

2

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ అడ్మిషన్ల గడువు పొడిగించాలి.. వైస్ ఛాన్సలర్‌కు విద్యార్థుల విజ్ఞప్తి..!!

3

Para Asian Games: పారా ఆసియా గేమ్స్‌లో భారత్ సరికొత్త రికార్డు.. తొలిసారి 100కి పైగా పతకాల కైవసం!

4

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే 75శాతం మార్కులు సాధించాల్సిందే.. ఆ సర్వీసులకు మాత్రం ఉచితం..!!

5

Haryana Monkey Attack: కోతిపై రూ. 51 వేల రికార్డు.. హర్యానా ఘటనపై జంతు ప్రేమికుల ఆగ్రహం.. వీడియో..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Para Asian Games India Medal Tally: పారా ఆసియా క్రీడల్లో భారత పారా అథ్లెట్లు సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ పతకాల వేట కొనసాగించారు. నిలకడైన ప్రతిభతో ఏకంగా 103 పతకాలను కైవసం చేసుకుని భారత్ పతకాల శతకాన్ని పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పతకాల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న భారత ఖాతాలో 27 స్వర్ణాలు, 33 రజతాలు, 43 కాంస్య పతకాలు చేరాయి. సాధించిన మొత్తం పతకాల్లో సగానికి పైగా పతకాలు కేవలం అథ్లెటిక్స్ విభాగం నుంచే రావడం విశేషం.

వరల్డ్ రికార్డులతో ట్రాక్ అండ్ ఫీల్డ్ ప్రభంజనం..
పురుషుల టీ64 విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో సందీప్ 52.28 సెకన్లలోనే రేసును పూర్తి చేసి, సరికొత్త ప్రపంచ రికార్డుతో బంగారు పతకాన్ని ముద్దాడాడు. ఇదే ఈవెంట్‌లో మరో భారత అథ్లెట్ అజయ్ కుమార్ 53.61 సెకన్ల టైమింగ్‌తో మూడో స్థానాన్ని దక్కించుకుని గేమ్స్ రికార్డు నమోదు చేశాడు.

మరోవైపు జావెలిన్ త్రో ఎఫ్‌37 విభాగంలో హనీ అసాధారణ రికార్డుతో చరిత్ర సృష్టించాడు. తన ఐదో ప్రయత్నంలో 59.72 మీటర్లు విసిరి ప్రపంచ రికార్డు నెలకొల్పిన హనీ, ఆ వెంటనే చివరి అవకాశంలో ఏకంగా 60.49 మీటర్ల దూరం విసిరి తన రికార్డును తానే బద్దలు కొట్టి స్వర్ణం గెలుచుకున్నాడు. అలాగే టీ46 విభాగం 1500 మీటర్ల పరుగులో ప్రమోద్ 4:09.65 నిమిషాల టైమింగ్‌తో రజతం సాధించగా, శ్రీలంక అథ్లెట్ పువాక్‌పిటికండె (4:03.25) గేమ్స్ రికార్డుతో స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

షూటింగ్, బ్యాడ్మింటన్లలో పతకాల పంట..
షూటింగ్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్‌1 విభాగంలో ఇప్పటికే స్వర్ణం సాధించిన మోనా అగర్వాల్, 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో మరోసారి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. గతంలో స్వీడన్ షూటర్ అన్నా బెన్సన్ (356 పాయింట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమిస్తూ మోనా 357.5 పాయింట్లతో పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

బ్యాడ్మింటన్‌లోనూ భారత్‌కు గొప్ప విజయాలు దక్కాయి. ఎస్‌ఎల్‌3 సింగిల్స్ విభాగం ఫైనల్లో నితేశ్ కుమార్ 21 - 18, 21 - 16 తేడాతో ప్రమోద్ భగత్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకోగా, ప్రమోద్‌కు రజతం దక్కింది. ఎస్‌ఎల్‌4 విభాగంలో నవీన్ శివకుమార్ 21-9, 21-17తో ఇండోనేషియా క్రీడాకారుడు ఫెర్డీపై విజయం సాధించి స్వర్ణం గెలిచాడు. మహిళల సింగిల్స్ ఎస్‌యూ5 ఫైనల్లో తులసిమతి మురుగేశన్ చైనా ప్లేయర్ యాంగ్ చేతిలో 18 - 21, 11 - 21తో ఓడి రజత పతకాన్ని అందుకుంది.

ఆర్చరీలో భారత్‌కు తొలి స్వర్ణం..
ఈ పోటీలలో భారత తొలి స్వర్ణ పతకం ఆర్చరీ నుంచే రావడం విశేషం. పురుషుల రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో హర్విందర్ సింగ్ - విజయ్ సుండి ద్వయం చైనా ఆర్చర్లను ఫైనల్లో ఓడించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Asian Games 2026
Sports News
Telugu News