• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /MP Dharmapuri Arvind: కేటీఆర్ గడ్డం వెనుక స్టోరీ ఇదే... అసలు విషయం బైటపెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్ .!.

MP Dharmapuri Arvind: కేటీఆర్ గడ్డం వెనుక స్టోరీ ఇదే... అసలు విషయం బైటపెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్ .!.

Dharmapuri arvind on ktr: కేటీఆర్ ఇటీవల సింగరేణి కార్మిక గర్జన సభలో మునుపెన్నడులేని విధంగా కొత్తగా గడ్డంతో కన్పించారు. సడెన్ గా కేటీఆర్ మాస్ లుక్ లో కన్పించడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.ఈ క్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ అంశంపై చేపిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Written ByInamdar Paresh
Published: Oct 22, 2026, 03:12 PM IST|Updated: Oct 22, 2026, 03:19 PM IST
joinshare
MP Dharmapuri Arvind: కేటీఆర్ గడ్డం వెనుక స్టోరీ ఇదే... అసలు విషయం బైటపెట్టిన ఎంపీ ధర్మపురి అర్వింద్ .!.
Image Credit: ktr(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి.. వేటగాడు తుపాకీతో కాల్చి 1 పిట్టను పడగొట్టాడు.. చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉంటాయి?

చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి.. వేటగాడు తుపాకీతో కాల్చి 1 పిట్టను పడగొట్టాడు.. చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉంటాయి?

2

‘జైలర్ 2’ మూవీపై అల్లు అర్జున్ మార్క్ రివ్యూ..

3

Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.

4

Vikarabad Anganwadi Jobs: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులకు ఆఖరి ఛాన్స్! 264 ఉద్యోగాలు, రెండే రోజులు గడువు!

5

దీపావళికి ఫోన్‌పే అదిరిపోయే ఆఫర్.. కేవలం రూ. 11లకే రూ. 25,000 బీమా కవరేజ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

MP Dharmapuri Arvind on  ktr new beard look row: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఎల్ నినో అంశం  హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. మరొవైపు సీఎం రేవంత్ సైతం ఎల్ నినోపై ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల రామగుండంలో జరిగిన సింగరేణి కార్మిక గర్జన సభకు హజరయ్యారు. మునుపెన్నడులేని విధంగా ఆయన సడెన్ గా గడ్డంతో మాస్ లుక్ లో కన్పించారు. దీంతో ఆయన కొత్త లుక్ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై కొంత మంది సెటైర్లు వేస్తుండగా మరికొంత మంది కొత్త లుక్ బాగుందని కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా.. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కేటీఆర్ గడ్డంపై చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.


ఎంపీ ధర్మపురి ఇటీవల తెలంగాణలో బీజేపీ నేతలు యాక్టివ్ గా లేరని వస్తున్న ఆరోపణలపై తనదైనస్టైల్ లో స్పందించారు. 2028  అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ సునామీ కన్పిస్తుందని అన్నారు. ఏ పార్టీతో పొత్తులేకుండానే అధికారంలోకి వస్తామని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. ఈ పార్టీల మధ్యనే పొత్తులు ఉంటాయని జోస్యం చెప్పారు. ఇక సీఎం రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పదవి పోవడం ఖాయమన్నారు.


కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ భారీగా ప్రజల ధనంను కొల్లకొట్టిందన్నారు. సోషల్ మీడియాలో మాత్రం పెయిడ్ ప్రమోషన్లు చేయించుకుంటున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ స్వయం అపరాధాల వల్ల కనుమరుగవుతుందని అన్నారు. బీఆర్ఎస్ ను కూడా ప్రజలు ఓడిస్తారని చెప్పుకొచ్చారు.


కేటీఆర్ గడ్డంపై సెటైర్లు..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డంపై ఎంపీ ధర్వపురి అర్వింద్ సెటైర్లు వేశారు. గడ్డం పెంచితే సీఎం అవుతారని ఎవరో చెప్పారంటూ , అందుకే కేటీఆర్ గడ్డం పెంచుతున్నారంటూ సెటైర్లు వేశారు. ఇక కేటీఆర్ కుటుంబంలో పాటించే సెంటిమెంట్ లపై ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదన్నారు. 

పాత సచివాలంయను కూలగొట్టి.. వాస్తు కోసం ప్రజాధనంను వెస్ట్ చేసి కొత్త సచివాలయం కట్టారంటూ ఎంపీ అర్వింద్ గుర్తు చేశారు. ఇక గతంలో ఉత్తమ్ కుమార్ సైతం కాంగ్రెస్ గెలిచే వరకు గడ్డం తీయనని పెంచిన విషయంపై మాట్లాడారు. ఏదో అనుకొకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పంచ్ లు వేశారు. అదే విధంగా కేటీఆర్ గడ్డం పెరుగుతుందేమో కానీ ఆయన సీఎం కావడం మాత్రం కల్ల అంటూ ఎంపీ అర్వింద్ పంచ్ లు వేశారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Telugu News
KTR
BJP