• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Vikarabad Anganwadi Jobs: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులకు ఆఖరి ఛాన్స్! 264 ఉద్యోగాలు, రెండే రోజులు గడువు!

Vikarabad Anganwadi Jobs: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులకు ఆఖరి ఛాన్స్! 264 ఉద్యోగాలు, రెండే రోజులు గడువు!

Vikarabad Anganwadi Jobs 2026: తెలంగాణలోని వికారాబాద్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని ఐసీడీఎస్ (ICDS) ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న 264 అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన స్థానిక మహిళా అభ్యర్థులు 2026 అక్టోబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Written ByHarish Darla
Published: Oct 22, 2026, 03:38 PM IST|Updated: Oct 22, 2026, 03:42 PM IST
joinshare
Vikarabad Anganwadi Jobs: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులకు ఆఖరి ఛాన్స్! 264 ఉద్యోగాలు, రెండే రోజులు గడువు!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

దీపావళి పూజలో పాత మట్టి ప్రమిదలు వాడొచ్చా? 3 నిమిషాల్లో కొత్తవాటిలా మార్చే అద్భుతమైన హ్యాక్స్!

2

చెట్టు మీద 10 పిట్టలు ఉన్నాయి.. వేటగాడు తుపాకీతో కాల్చి 1 పిట్టను పడగొట్టాడు.. చెట్టు మీద ఎన్ని పిట్టలు ఉంటాయి?

3

‘జైలర్ 2’ మూవీపై అల్లు అర్జున్ మార్క్ రివ్యూ..

4

Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. వదినపై దాడి చేసిన మరిది..అసలు విషయం ఇదే.!.

5

Vikarabad Anganwadi Jobs: తెలంగాణలో అంగన్‌వాడీ పోస్టులకు ఆఖరి ఛాన్స్! 264 ఉద్యోగాలు, రెండే రోజులు గడువు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vikarabad Anganwadi Jobs 2026: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 264 ఖాళీలలో 102 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు, 162 అంగన్‌వాడీ ఆయా పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులను జిల్లా పరిధిలోని కోడంగల్, మర్పల్లి, పరిగి, తాండూరు, వికారాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల వారీగా భర్తీ చేయనున్నారు.

ప్రాజెక్టుల వారీగా ఖాళీల వివరాలు..
పరిగి ప్రాజెక్టు కింద 27 టీచర్, 78 ఆయా పోస్టులు (మొత్తం 105) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే తాండూరు ప్రాజెక్టులో 23 టీచర్, 28 ఆయా పోస్టులు (మొత్తం 51)..  కోడంగల్ ప్రాజెక్టులో 13 టీచర్, 31 ఆయా పోస్టులు (మొత్తం 44).. మర్పల్లి ప్రాజెక్టులో భాగంగా 21 టీచర్, 14 ఆయా పోస్టులు (మొత్తం 35) ఉన్నాయి. చివరిగా వికారాబాద్ ప్రాజెక్టులో భాగంగా 18 టీచర్, 11 ఆయా పోస్టులు (మొత్తం 29) భర్తీ చేయనున్నారు.

విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ (12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అయితే, అంగన్‌వాడీ ఆయా (హెల్పర్) పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో పదో తరగతి ఉత్తీర్ణులైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు. వయోపరిమితి, స్థానికత వంటి ఇతర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించవచ్చు. జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత చైర్మన్ నేతృత్వంలో నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం..
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 10 అక్టోబర్ 2026
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24 అక్టోబర్ 2026
ధ్రువీకరణ పత్రాల సమర్పణ గడువు: 26 అక్టోబర్ 2026 నుండి 1 నవంబర్ 2026 వరకు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు పూర్తి చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తు ప్రతితో పాటు అన్ని ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్ణీత గడువులోగా సమర్పించాల్సి ఉంటుంది. అర్హులైన మహిళలు చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేసుకోవడం మంచిది.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Job Notification
Govt Jobs
Telugu News