Muslim youth Devotee wins Ganesh laddu in auction in Jagtial: తెలంగాణలో వినాయక నిమజ్జనం ఎంతో ఉల్లాసంగా జరుగుతుంది. గణపయ్య విగ్రహాలను మండపాల నుంచి ప్రత్యేక వాహనాల్లో యూత్ సభ్యులు నెమ్మదిగా గంగమ్మ ఓడికి తరలిస్తున్నారు. పోలీసులు సైతం వినాయక నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మరోవైపు వినాయక నిమజ్జనంలో పలు చోట్ల అరుదైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చాలా చోట్ల భిన్నత్వంలో ఏకత్వంను చాటుకుంటున్నారు. వినాయకుడి ఉత్సవాలలో ముస్లిం కుటుంబాలు కూడా పాల్గొంటున్నాయి. ఈ క్రమంలో జగిత్యాలలో గణేషుడి లడ్డు వేలంపాటలో ఒక ముస్లిం యువకుడు పాల్గొన్నాడు.
జగిత్యాల పట్టణంలోని గోవిందుపల్లె టీం సెవెన్ యూత్ గణేశ్ మండపం మతసామరస్యానికి కేంద్రంగా నిలిచింది. మండపం నిర్వాహకులు గణపతి లడ్డూను వేలంపాటను నిర్వహించారు. దీనిలో ముస్లిం యువకుడు మహ్మద్ ఇషాన్ పాల్గొన్నాడు. అయితే.. అతను అక్కడున్న వారితో పోటా పోటీగా వేలం పాట పడి మరీ వినాయకుడి లడ్డును ఏకంగా రూ.70 వేలకు పాట పాడిమరీ దక్కించుకున్నాడు. దీంతో యూత్ సభ్యులు సన్యానించి మరీ మహ్మద్ ఇషాన్ కు లడ్డును అందజేశారు.
సదరు బాలుడు.. గణేశ్‌నగర్‌కు చెందిన ప్రముఖ గాయకుడు ఎండీ అభి కుమారుడు . ఇషాన్ బాల్యం నుంచే స్నేహితులతో కలిసి గణేశ్ నవరాత్రుల్లో పాల్గొంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు కూడా ఏరోజు కూడా ఇషాన్ ను అడ్డుకొలేదని చెప్పుకొచ్చారు.
ఇప్పటికే తన మిత్రులతో కలిసి వినాయకుడిని మండపంలో ఇషాన్ ప్రతిష్టించాడు. ఇక వేలంపాల పడి వినాయుడి లడ్డును దక్కించుకున్నందుకు ఎంతగానో సంతోషంగా ఉందని ఇషాన్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో స్థానికులు ఇషాన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.