SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సీపీఎస్ రద్దుపై కీలక అడుగు..త్వరలో ప్రత్యేక అధ్యయన కమిటీ..!!

Old Pension Scheme: రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్థిక, సర్వీసు వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులతో పాటు, సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చనున్నట్లు సమాచారం.

Written By Bhoomi
Published: Nov 18, 2026, 08:52 IST | Updated: Nov 18, 2026, 08:54 IST
Image Credit: Old Pension Scheme:
Join

Old Pension Scheme: రాష్ట్రంలో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) రద్దుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధ్యయన కమిటీని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్థిక, సర్వీసు వ్యవహారాల్లో అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారులతో పాటు, సీపీఎస్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కూడా ఈ కమిటీలో సభ్యులుగా చేర్చనున్నట్లు సమాచారం.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పాత పెన్షన్ విధానాన్ని (Old Pension Scheme) తిరిగి అమలు చేయడం కష్టతరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సీపీఎస్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏర్పాటు చేయనున్న ఈ కమిటీ.. సీపీఎస్ రద్దుకు ఉన్న సాధ్యాసాధ్యాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయనుంది. ఒకవేళ రద్దు చేసే అవకాశాలు ఉంటే, దాన్ని ఏ విధంగా అమలు చేయాలనే విధివిధానాలపై సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనుంది.

2004 సెప్టెంబర్ 1న దేశవ్యాప్తంగా సీపీఎస్ (CPS) అమలు చేసింది.  అయితే, అప్పటికే ఉద్యోగ ప్రకటనలు జారీ కావడం, నియామకాలు ఆలస్యంగా జరగడం వల్ల, ఆ ఉద్యోగులు కొత్త పింఛను పథకం పరిధిలోకి వచ్చారు. పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని కోరుతూ వారు న్యాయం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా, 2004 సెప్టెంబర్ 1కి ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పాత పింఛను పథకాన్ని అమలు చేయడానికి అంగీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఒక జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ఈ విధంగా ఉద్యోగంలో చేరిన సుమారు పదివేల మంది ఉద్యోగులు ఉన్నారు. తమకు కూడా పాత పింఛను పథకాన్ని అమలు చేయాలని వారు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్‌పై అధ్యయన కమిటీ ఈ విషయంపై అందరి అభిప్రాయాలను తీసుకుని తుది నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.

కాగా ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు మాస్ లీవులతో నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదలై 3ఏండ్లు పూర్తయిన సందర్బంగా సీపీఎస్ఈయూ పిలుపు మేరకు దాదాపు లక్షకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు సామూహిక సెలవులు పెట్టారు. మంగళవారం హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ దగ్గర సీపీఎస్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్షలు చేపట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం...ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు టీచర్లు పెద్ద సంఖ్యలో సామూహిక సెలవులపై వెళ్లడంతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలపై తీవ్ర ప్రభావం పడింది.

ఇందిరా పార్కు దగ్గర జరిగిన ధర్నాలో సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షులు గంగారపు స్థితప్రజ్న మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1.72 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు సెలవు పెట్టి నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిపారు. 2023 ఎన్నికలకు ముందు వరంగల్, జడ్చర్ల సభల్లో రేవంత్ రెడ్డి సహా జాతీయ , రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఓపీఎస్ అమలుపై స్పష్టమైన హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. 

చదువే తలరాతను మార్చే ఆయుధం.. విద్యార్థులు తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES