Siddipet: హస్టల్ విద్యార్థినులకు బూతూ మెస్సెజ్‌లు.. సిద్దిపేట్ వెటర్నరీ ప్రిన్సి పాల్‌పై పోక్సోకేసు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
Pocso case on principal in siddipet: రాత్రివేళ బాలికల హాస్టల్‌కు వెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పలువురు విద్యార్థినులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సి పాల్ యవ్వారం కాస్త బైటపడింది. సిద్దిపేట ఘటనపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Pocso Case filed on veterinary polytechnic college principal: ఇటీవల కామాంధులు కొంత మంది బరితెగించి ప్రవర్తిస్తున్నారు. పసిపాప నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడంలేదు. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలు, హస్టళ్లలో ఉంటున్న వారిని కూడా లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. వీరిలో కొంత మంది ఉపాధ్యాయులు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు ఉండటం కూడా తీవ్ర ఆందోళనలకు గురిచేస్తుంది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి చదువు, వసతి కోసం హస్టళ్లలో ఉంచి మరీ విద్యను అందించేలా చూస్తున్నారు.
కానీ అక్కడి సిబ్బంది మాత్రం అమ్మాయిల పట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట్ లో వెటర్నరీ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ బాలికలకు బూతు మెస్సెజ్ లు పంపుతూ, లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
సిద్దిపేట జిల్లా చంద్లాపూర్ వెటర్నరీ కళాశాల ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్ గత కొన్ని రోజులుగా హస్టల్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు బైటపడ్డాయి. బూతు మెస్సెల్ పంపి వేధింపులకు గురిచేశాడని కొంత మంది బాలికలు ఆరోపించారు. ఈ క్రమంలో కొంత మంది బాలికలు వారి తల్లిదండ్రులకు వాట్సాప్ సందేశాలు చూపించడంతో ఈ ఘటన స్థానికంగా దుమారంగా మారాయి.
విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్ బొబ్బిలి రాజేందర్ పై పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనపై గతంలో కూడా బాలికల తల్లిదండ్రులు యూనివర్సీటీ అధికారులకు ఫిర్యాదు చేసిన కూడా పట్టించుకోలేదని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
దీనిపై యూనివర్సీటీ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారరు. ఘటనపై ముగ్గురు ప్రొఫెసర్లతో విచారణ కమిటీని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శరత్‌చంద్ర ఏర్పాటు చేసింది. నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. తాజాగా పోక్సో కేసు నమోదు కావడంతో కలకలం రేగింది.