SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Kavitha: కరువు మండలాలను వెంటనే ప్రకటించండి.. సీఎం రేవంత్‌పై కవిత సెన్సెషనల్ కామెంట్స్..

Kavitha fires on cm revanth reddy: తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు 20 అడుగులు పడిపోయాయని కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం చేసినా.. వర్షాలు పడక పోవడంతో ఆయన చేతులెత్తేశారని సెటైర్లు వేశారు.

Written By Inamdar Paresh
Published: Oct 04, 2026, 02:25 PM IST | Updated: Oct 04, 2026, 02:33 PM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

Kavitha fires on cm revanth reddy govt: తెలంగాణ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం కన్పిస్తుంది. ముఖ్యంగా రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఇప్పటికే వర్షాలు లేక వేసిన పంటలతో పాటు చేతికి వచ్చాయనుకున్న పంటలుకూడా ఎండిపోయాయి. అంతే కాకుండా వర్షాలు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తుందని విమర్శించారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటించాయన్నారు.ఏపీ సైతం కరువుమండలాలను ప్రకటించిందని పేర్కొన్నారు. 

ఇంకా ఎప్పుడు   తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు కరువు మండలాలను ప్రకటిస్తుందని ప్రశ్నలు సంధించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయకుంటే.. కరువు మండలాలను గుర్తించే అధికారుల టీమ్ ఎప్పుడొస్తారని, వారు కేంద్రంకు నివేదిక ఎప్పుడిస్తారని, నిధులు ఎప్పుడు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు 20 అడుగులు పడిపోయాయని కవిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుణ యాగం చేసినా.. వర్షాలు పడక పోవడంతో ఆయన చేతులెత్తేశారని సెటైర్లు వేశారు.

 రాష్ట్రంలో 6 గంటలకు మించి విద్యుత్ ఇవ్వడం లేదని,వెంటనే విద్యుత్ కొనుగోలుపై చర్యలు తీసుకొవాలని రేవంత్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యుత్ కోతలు నిరూపించేందుకు సీఎం రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లికి రమ్మన్నా వస్తానంటూ.. కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. అదే విధంగా ఎన్నికలలో మరల ఈవీఎంలను రద్దు చేసి బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలన్నారు. 

దీని కోసం ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని తెలిపారు. సర్ ప్రక్రియపై సీఈసీ రాజీనామా చేయడం తాత్కాలిక ఉపశమనం అని పేర్కొన్నారు. ఖైరతాబాద్ ఉపఎన్నికతో పాటు ప్రతి ఎన్నికలలోను తమ టీఆర్ పార్టీ బరిలో ఉంటుందని కవిత క్లారిటీ ఇచ్చారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES