• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.

Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.

Female teacher molested in Hyderabad: ప్రతిరోజు స్కూల్ లో ప్రిన్సిపాల్ వేధిస్తుండటంతో టీచర్ స్కూల్ కు వెళ్లడం మానేసింది. ఇంట్లోని వారు ఆరా తీయడంతో అసలు విషయం చెప్పింది.సురారం పరిధిలోని ప్రైవేటు స్కూల్ లో చోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written ByInamdar Paresh
Published: Sep 26, 2026, 22:24 IST|Updated: Sep 26, 2026, 22:32 IST
joinshare
Hyderabad: డ్రీమ్ గర్ల్ అంటూ లేడీ టీచర్‌కు వేధింపులు... హైదరాబాద్‌లో బైటపడ్డ ప్రిన్సిపాల్ బాగోతం.!.
Image Credit: Hyderabadcrime(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

జుట్టు కుదుళ్లు బలపడాలంటే ఇది బెస్ట్ టిప్.. హోమ్‌మేడ్ మెంతుల హెయిర్ ప్యాక్ పూర్తి విధానమిదే!

2

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

3

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

4

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

5

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Private school principal Harassed female teacher in suraram Hyderabad: సమాజంలో ఉపాధ్యాయులకు ఎంతో ఉన్నతమైన స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత గురువులు ముఖ్యమని చాలా మంది ప్రత్యేకంగా గౌరవించుకుంటారు. అందుకే చాలా మంది కన్నవాళ్లు తమ పిల్లలను మంచి స్కూళ్లలో జాయిన్ చేస్తారు. పిల్లలకు మంచి విద్యాబోధన అందించాలనికోరుకుంటారు. అదే విధంగా చాలా మంది ఉపాధ్యాయులు తమ వృత్తిని దైవంలా భావిస్తారు. 

కానీ కొంత మంది తులసీ వనంలో గంజాయి మొక్కల్లా దాపురించారు. వీరు తోటి మహిళ ఉపాధ్యాయులను, విద్యార్థినులు కూడా వేధింపులకు గురిచేస్తారు. ఇలాంటి వారు తమ వృత్తికే మాయనిమచ్చగా మిగిలిపోతారు. తప్పతాగి క్లాసులకు రావడం, తమ పనులను విద్యార్థులతో చేయించుకొవడం చేస్తారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం. తాజాగా.. ఈ కోవకు చెందిన ఒక ఘటన హైదరాబాద్ లోని సురారంలో చోటు చేసుకుంది.

 

హైదరాబాద్ లోని సురారంలో ఉన్న ఒక ప్రైవేటు స్కూల్లో ప్రిన్సిపాల్ తోటి మహిళ టీచర్ ను వేధింపులకు గురిచేశాడు.ప్రతిరోజు ఏదో వంకతో ఆమెను మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. అతని నుంచి లేడీ టీచర్ తరచుగా తప్పించుకునేది. కానీ ప్రిన్సిపాల్ మాత్రంతన వంకర బుద్దిని మార్చుుకోలేదు. తరచుగా శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. 

ఆ కామాంధుడు తన ఫోన్ లో లేడీ టీచర్ పేరును డ్రీమ్ గర్ల్ అని పెట్టుకుని మరీ రోజు లైంగికంగా వేధించేవాడు.  ఇటీవల ఈ వేధింపులు కాస్త మరీ హద్దులుదాటి పోవడంతో లేడీ టీచర్ స్కూల్ మానేసింది. ఇంట్లోని వారు ఏంజరిగిందని ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. దీంతో కాలనీ వాసులు, లేడీటీచర్ కుటుంబ సభ్యులు స్కూల్ మీదకు దాడికి వెళ్లారు. 

ప్రిన్సిపల్ ను నిలదీశారు. దీంతో ప్రైవేటు స్కూల్ సిబ్బంది.. బాధితులపై రివర్స్ లో కత్తులతో దాడి చేశారు. స్కూల్ లోపెద్దరచ్చగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇరు వైపులా వారిని అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారంగా మారింది. ఆ ప్రిన్సిపాల్  పై కఠిన చర్యలు తీసుకొవాలని కాలనీ వాసులు, టీచర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Crime News