• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం తీరుపై కిషన్ రెడ్డి ఫైర్..

దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం తీరుపై కిషన్ రెడ్డి ఫైర్..

Revanth Reddy Controversial Statements: పరమశివుడు పేదోళ్లకు..శ్రీరాముడు ధనికులకు దేవుడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా దేవుళ్లను విభజించి పాలించడంపై బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్‌కు లెఫ్ట్‌ రైట్ ఇచ్చుకున్నాడు. తాజాగా కిషన్ రెడ్డి.. రేవంత్ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 01:59 PM IST|Updated: Oct 01, 2026, 02:04 PM IST
joinshare
దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సీఎం తీరుపై  కిషన్ రెడ్డి ఫైర్..
Image Credit: Revanth Reddy Vs Kishan Reddy (File Pic/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kishan Reddy Fire on Revanth Reddy Comments on Hindu Gods: ప్రజలకు మార్గదర్శకంగా ఉండాల్సిన నేతలు ఇలా మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి వైషమ్యాలు క్రియేట్ చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ర రెడ్డి తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తూర్పారా పట్టారు.  చివరకు దేవుళ్లను కూడా రాజకీయాల్లో లాగుతున్నారని మండిపడ్డారు. మొత్తం హిందూ సమాజాన్నే అవమాన పరిచేలా రాముడు, శివుడు పేరుతో సీఎం వ్యాఖ్యలు హిందువుల మధ్య గొడలు పెట్టేలా ఉన్నాయన్నారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కొత్త అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను విభజించే అలవాటు కాంగ్రెస్‌ పార్టీకి ఆనాటి నుంచే ఉందన్నారు. అలా దేశాన్ని హిందూస్థాన్, పాకిస్థాన్ అనే రెండు దేశాలను చేశారు. తాజాగా హిందు దేవుళ్లపై విభజన తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కిషన్ రెడ్ది మండిపడ్డారు. ఇతర మతాల దేవుళ్లపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.ఇటీవలె రేవంత్ రెడ్డి..  హైదరాబాద్, ఢిల్లీలో వేర్వేరు సందర్భాల్లో దేవుళ్ల  పేర్లను ప్రస్తావించి, ఒక్కొక్కరు ఒక్కో దేవుణ్ణి అభిమానిస్తూ అభిప్రాయంతో ఉన్నారన్నారు.  రాజకీయ నాయకులపట్ల ప్రజలు ఏకాభిప్రాయంతో లేరని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఉద్దేశ పూర్వకంగా  దేవుళ్లలో విభజన, దేశంలో ప్రాంతీయ తత్వంపై విషం చిమ్ముతున్నారని బీజపీ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. కులం, ప్రాతం, మతం ఆధారంగా దేశ ప్రజలను కాంగ్రెస్ విడదీసినట్లే… ఇపుడు దేవుళ్లను విభజించాలని చూస్తోందని భారతీయ జనతా పార్టీ  మండిపడుతోంది.

రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం..

ఇటీవల హైదరాబాద్ కాంగ్రెస్ ముఖ్యనేతల సమావేశం, తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల పేర్లను ప్రస్తావించి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాదిలో రాముడిని, దక్షిణాదిలో శివుడిని కొలుస్తారన్నారు. బీజేపీ రాముడిని లాక్కుందని తెలిపారు.  శివుడు పేదల దేవుడు.. రాముడు ధనవంతుల దేవుడు.  బీజేపీ ధనవంతుల పార్టీ  అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ప్రస్తావన రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీశాయి.

ఆర్యులు, ద్రవిడులనే విభజన రేఖ.. 
ఉత్తర భారతీయులు ఆర్యన్లు, వారు రాముడిని పూజిస్తారు. దక్షిణ భారతీయులు ద్రావిడులు, వారు శివుడి భక్తులు. రాముడు ధనికుల దేవుడని, శివుడు పేదల దేవుడని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

అంతకుముందు హైదరాబాద్ లో జరిగిన కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్లపేర్లను ప్రస్తావించారు. కాంగ్రెస్ నాయకుల్లో వర్గాలు, నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయనే అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నపుడు దేవుళ్ల పేర్లు చెబుతూ...ఒక్కొక్కరు ఒక్కొక్కరిని విశ్వసిస్తున్నారన్నారు.  అలాగే నాయకుల్లోనూ ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారని ఉదహరించే ప్రయత్నం చేశారు.

హిందువుల్లో ఎంతమంది దేవుళ్లున్నారు? మూడు కోట్ల మంది ఉన్నారా? మన జనాల్లో పెండ్లి చేసుకోని హనుమంతుడున్నాడు. రెండు పెండ్లిండ్లు చేసుకునేటోళ్లకు ఇంకోకాయన దేవుడున్నడు. మందు తాగేటోళ్లకు ఓ దేవుడున్నడు ఎల్లమ్మ, పోచమ్మ. కల్లు పొయ్యాలె, కోడి కొయ్యాలె అనేటోళ్లకు ఓ దేవుడున్నడు. పప్పన్నం తినేటొళ్లకు కూడా దేవుడున్నాడు. అన్ని రకాల దేవుళ్లున్నారు. అని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.

దేవుళ్ల పేర్లతో రాజకీయం తగదని బీజేపీ సూచన..

కాంగ్రెస్‌ పార్టీలో కూడా అన్ని రకాల వారున్నారు. దేవుడిపైనే ఏకాభిప్రాయంలేనప్పుడు, నాయకులపై ఏకాభిప్రాయాన్ని ఆశించడం కరెక్ట్ కాదనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

ప్రజల్లో భిన్నాభిప్రాయాలను రేవంత్ రెడ్డి విశ్లేషించారు. ఒకాయన వేంకటేశ్వరస్వామికి మొక్కుతానంటే, మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతా అంటడు. ఇంకొకాయన లేదు.. లేదు నేను అయ్యప్పమాల వేస్తానంటే, మరో ఆయన శివమాల వేస్తానంటడు. దేవుళ్ల మీదనే ప్రజల్లో ఏకాభిప్రాయం తీసుకురానప్పుడు రాజకీయ నాయకుల మీద ఏకాభిప్రాయం ఉంటదని ఎలా నమ్మగలమనే అభిప్రాయం వ్యక్తంచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. హిందువులంటే తాగుబోతులు, తిండిబోతులుగా చిత్రీకరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

శివుడు పేదల దేవుడు, రాముడు ధనవంతుల దేవుడు- రేవంత్..
దేవుళ్ల పేర్లను ప్రస్తావించి, ప్రజలు విభిన్న మనస్కులనే వ్యాఖ్యలను  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తప్పుబట్టారు.  కులం, ప్రాంతం, మతం ఆధారంగా దేశ ప్రజలను విడదీసిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు ఏకంగా దేవుళ్లను కూడా విభజించాలని చూస్తోందని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.

హిందువులను విభజించి, ముస్లింలను ఏకం చేయాలనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, హిందూ సమాజంపై కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ఉన్న ద్వేషాన్ని ప్రతిబింబిస్తున్నాయని విమర్శించారు.

విభజించు-పాలించు అనే నీచమైన రాజకీయ వ్యూహాన్ని  కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని రాంచందర్ రావు ధ్వజమెత్తారు. ఈ వివాదంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, వినియోగదారుల వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర సహా పలువురు బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.

దేవుళ్ల పేర్లతో రాజకీయం తగదని బీజేపీ సూచన..
హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ రెడ్డి కించపరిచారని దుమారం రేగుతుంటే.. మరోవైపు సినీ నటుడు అల్లు శిరీష్.. నల్లగండ్ల అపర్ణా గేటెడ్ కమ్యూనిటీలో హనుమంతుని పూజల పేరుతో కర్ణకఠోర శబ్దాలతో డీజేలు పెట్టి గందరగోళం చేస్తున్నారని మండిపడ్డారు. తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. షేక్‌పేట్ అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభా నగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తోందని పేర్కొన్నారు. రోజువారీగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్దంతో మైకులు మోగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని ప్రస్తావించారు.

హనుమాన్ ఆలయం లౌడ్ మ్యూజిక్ విషయంపై వినాయక నిమజ్జనం వరకు సర్దుకుపోవాలని తనకు పోలీసులు సూచించారని అల్లు శిరీశ్ పేర్కొన్నారు.గణేశ్ నిమజ్జనం పూర్తి అయినా ఇంకా ఆలయంలో మైకుల శబ్దం తగ్గకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిద్రలేక స్థానిక వయోవృద్ధులు,చిన్న పిల్లలు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి సరైన స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకొని చర్యలు తీసుకోవాలని అల్లు శిరీశ్ విజ్ఞప్తి చేశారు. హిందూ దేవళ్లంటే అందరికీ అలుసైపోయిందని, దేవుళ్ల పేర్లతో రాజకీయం చేయవద్దని ప్రజలు కోరుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
BJP
Congress
Telangana News