సమ్మక్క సాగర్ బ్యారేజీకి ఎన్‌ఓసీ ఇవ్వండి.. ఛత్తీస్‌గఢ్ సీఎంకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి..
Revanth Reddy: తెలంగాణ రేవంత్ రెడ్డి సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ యేడాది ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నీటి ఎద్దడి నెలకొనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులును పూర్తి చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే తుమ్మిడిహట్టి ప్రాజెక్ట్ విషయంలో మహారాష్ట్ర సీఎంతో సానుకూల చర్చలు జరిగిన రేవంత్ సర్కారు.. సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ కోసం ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana CM Vs Chhattisgadh CM: ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో నీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం ఛత్తీస్‌గడ్ సీఎంకు వివరించారు. సమ్మక్క సాగర్ బ్యారేజీలో నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన మిగిలిన అనుమతులకూ సహకరించాలని కోరారు.సీఎం విజ్ఞప్తిపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ సానుకూలంగా స్పందించారు. ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ముందుగా కాంతనపల్లి వద్ద ప్రతిపాదించారు. ఆ ప్రాంతంలో 11,408 ఎకరాల భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 17 ఆదివాసీ గ్రామాలు, భద్రతా మౌలిక సదుపాయాలపై ప్రభావం పడుతుందని గుర్తించారు. ముంపును తగ్గించేందుకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని తుపాకులగూడెంకు మార్చారు.
ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనం ప్రకారం.. పూర్తి స్థాయి నీటి మట్టం వద్ద ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 33 ఎకరాలు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. భారీ వరదల సమయంలోనూ ప్రభావిత ప్రాంతం 100 ఎకరాలకు మించదని చెబుతున్నారు.
ఇప్పటికే సమ్మక సాగర్ ప్రాజెక్ట్ అధ్యయనం కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కోరిన రూ.9.883 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ లోనే చెల్లించింది. ఐఐటీ ఖరగ్‌పూర్ తన నివేదికను జూలై 30న ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్‌కు నివేదిక సమర్పించింది.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం పూర్తయింది. పూర్తి స్థాయి నీటి మట్టం +83 మీటర్ల వద్ద దీని నిల్వ సామర్థ్యం 6.94 టీఎంసీలు ఉంది. కరువు ప్రభావిత, వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాలకు గోదావరి జలాలను వినియోగించుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ వల్ల ఛత్తీస్‌గఢ్‌లో భూసేకరణ, సహాయ పునరావాసంతో పాటు పరిహారంకి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీగా ఉందని సీఎం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్‌ఓసీని త్వరగా జారీ చేయాలన్నారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.