Rmp doctor abuses and brutally attacks on Gachibowli police: సమాజంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతు ఉంటారు. వారి ప్రాణాలను, పర్సనల్ లైఫ్ ను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పాటు పడతారు. ఇలాంటి పోలీసుల పట్ల అందరు ఎంతో గౌరవంతో ఉండాలి. కానీ కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. నేరం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై ఫిర్యాదు చేస్తే అక్కడకు వెళ్లిన పోలీసులపై కొంత మంది దాడులు చేయడం, బూతులు తిట్టడం చేస్తున్నారు.
గచ్చిబౌలిలో పోలీసులపై దాడి చేసిన RMP డాక్టర్
112కి ఫిర్యాదు రాగా నానక్‌రామ్‌గూడలోని అపోలో ఆసుపత్రి సమీపంలో విచారించడానికి వెళ్లిన హెడ్ కానిస్టేబుల్ శివకుమార్‌తో వాగ్వాదానికి దిగి అతని ఫోన్ నేలకేసి కొట్టి దాడికి పాల్పడ్డ RMP డాక్టర్
పోలీస్ సిబ్బంది కాలర్ పట్టుకుని, ముఖంపై… pic.twitter.com/VLXSi5ex6U— Telugu Scribe (@TeluguScribe) September 29, 2026
ఇలాంటి సందర్భాలలో వారికి పీఎస్ లో తగిన విధంగా పోలీసులు సైతం ట్రీట్ మెంట్ ఇస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ పరిధిలోని అపోలో ఆస్పత్రి సమీపంలో నుంచి 112 టోల్ కు కొంత మంది ఆర్ఎంపీ డాక్టర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్ ను విచారించేందుకు ప్రయత్నించారు. కానీ అతను మాత్రం బూతులు తిడుతూ, పిడిగుద్దులు కురిపించాడు. దీంతో పోలీసులు సైతం తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు, కొంత మంది సిబ్బందిని రప్పించి ఆర్ఎంపీ డాక్టర్ ను వాహనంలో పీఎస్ కు తరలించారు. అతను పోలీసుల వాహనంలో కూడా బూతులు తిడుతూ.. దమ్ముంటే తన సంకెళ్లు తీయాలని బూతులు తిట్టాడు. నిందితుడు వరంగల్ పట్టణంలోని ఉషా క్లినిక్‌లో RMP డాక్టర్‌గా పనిచేస్తున్న సునీల్ కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు వాహనంలో అతను బూతులు తిట్టడం, దాడికి యత్నించిన ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
దీనిపై నెటిజన్ ఇలాంటి వారికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలని కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం అసలు అతని మైండ్ సెట్ కరెక్ట్ గా ఉందా ..?.. అన్న అనుమానం కల్గుతుందని కామెంట్ లు చేస్తున్నారు.