SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hyderabad: గచ్చిబౌలిలో రెచ్చిపోయిన ఆర్ఎంపీ డాక్టర్.. ఏకంగా పోలీసుల కాలర్ పట్టుకుని, బూతులు తిడుతూ.. వీడియో..

Rmp doctor attack on Gachibowli police: పోలీసుల వాహనంలోనే ఆర్ఎంపీ డాక్టర్ రెచ్చిపోయాడు. వారిని బూతులు తిడుతూ దాడికి తెగబడ్డాడు. నానన్ రామ్ గూడలోచోటు చేసుకున్న ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Sep 30, 2026, 07:39 AM IST | Updated: Sep 30, 2026, 07:44 AM IST
Image Credit: rmpdoctorsunilattackongachibowlicopvideo
Join


Rmp doctor abuses and brutally attacks on Gachibowli police: సమాజంలో పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతలను కాపాడుతు ఉంటారు. వారి ప్రాణాలను, పర్సనల్ లైఫ్ ను సైతం పణంగా పెట్టి ప్రజల కోసం పాటు పడతారు.  ఇలాంటి పోలీసుల పట్ల అందరు ఎంతో గౌరవంతో ఉండాలి. కానీ కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు.  నేరం చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కల్గించిన వారిపై ఫిర్యాదు చేస్తే అక్కడకు వెళ్లిన పోలీసులపై కొంత మంది దాడులు చేయడం, బూతులు తిట్టడం చేస్తున్నారు. 

 

 

ఇలాంటి సందర్భాలలో వారికి పీఎస్ లో తగిన విధంగా పోలీసులు సైతం ట్రీట్ మెంట్ ఇస్తారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడ పరిధిలోని అపోలో ఆస్పత్రి సమీపంలో నుంచి 112 టోల్ కు కొంత మంది ఆర్ఎంపీ డాక్టర్ పై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు ఆర్ఎంపీ డాక్టర్ ను విచారించేందుకు ప్రయత్నించారు. కానీ అతను మాత్రం బూతులు తిడుతూ, పిడిగుద్దులు కురిపించాడు. దీంతో పోలీసులు  సైతం తీవ్రంగా గాయపడ్డారు. 

స్థానికులు, కొంత మంది సిబ్బందిని రప్పించి ఆర్ఎంపీ డాక్టర్ ను వాహనంలో పీఎస్ కు తరలించారు. అతను పోలీసుల వాహనంలో కూడా బూతులు తిడుతూ.. దమ్ముంటే తన సంకెళ్లు తీయాలని బూతులు తిట్టాడు.  నిందితుడు వరంగల్ పట్టణంలోని ఉషా క్లినిక్‌లో RMP డాక్టర్‌గా పనిచేస్తున్న సునీల్ కుమార్ (36)గా పోలీసులు గుర్తించారు. 

ఈ క్రమంలో అతనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు వాహనంలో అతను బూతులు తిట్టడం, దాడికి యత్నించిన ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. 

దీనిపై నెటిజన్ ఇలాంటి వారికి సరైన ట్రీట్ మెంట్ ఇవ్వాలని కొంత మంది కామెంట్ లు చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం అసలు అతని మైండ్ సెట్ కరెక్ట్ గా ఉందా ..?.. అన్న అనుమానం కల్గుతుందని కామెంట్ లు చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES