Telangana SI Hall Ticket Download: తెలంగాణలో ఎస్సై అభ్యర్థులకు బిగ్ అలర్ట్. సబ్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాల నియామక ప్రక్రియ కీలక దశకు చేరింది. ఈ నియామకాలకు సంబంధించిన ప్రాథమిక వ్రాత పరీక్ష హాల్ టికెట్లు నేటి నుంచి అధికారిక వెబ్ సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా తమ హాల్ టికెట్లను ఈ నెల 28వ తేదీ వరకు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుందని రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో మొత్తం 275 ఎస్సై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సుమారు 1.60లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికోసం ఈ నెల 29 నుంచి ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 335 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుంది.
హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ ద్వారా ఇలా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
1. TGPRB అధికారిక వెబ్‌సైట్ tgprb.in లోకి వెళ్లండి.
2. హోమ్‌పేజీలో ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెట్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి.
4. హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోండి.
అభ్యర్థులకు ముఖ్య సూచనలు:
ఫొటో అతికించడం తప్పనిసరి:
డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై కేటాయించిన స్థలంలో అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోను తప్పకుండా అతికించాలి. ఫొటో లేకుండా వచ్చే వారిని పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
హాల్ టికెట్ భద్రత:
ఎంపిక ప్రక్రియ మొత్తం ముగిసేంత వరకు ఈ హాల్ టికెట్‌ను అభ్యర్థులు అత్యంత జాగ్రత్తగా భద్రపరుచుకోవాల్సి ఉంటుంది.
Also Read: