• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /భారత్‌ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ మాస్టర్ ప్లాన్.. ‘ఆపరేషన్ సింధూర్’లో పాక్ మద్దతుపై అమెరికా సంచలన రిపోర్ట్..!!

భారత్‌ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ మాస్టర్ ప్లాన్.. ‘ఆపరేషన్ సింధూర్’లో పాక్ మద్దతుపై అమెరికా సంచలన రిపోర్ట్..!!

China Pakistan Alliance: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ కు .. ప్రపంచవ్యాప్తంగా తన కుటిల వ్యూహాలకు పేరుగాంచిన చైనా.. ఈ రెండు దేశాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న స్నేహం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.

Written ByBhoomi
Published: Nov 21, 2026, 18:57 IST|Updated: Nov 21, 2026, 18:59 IST
joinshare
భారత్‌ను దెబ్బకొట్టేందుకు డ్రాగన్ మాస్టర్ ప్లాన్.. ‘ఆపరేషన్ సింధూర్’లో పాక్ మద్దతుపై అమెరికా సంచలన రిపోర్ట్..!!
Image Credit: China Pakistan Alliance:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

China Pakistan Alliance: ఉగ్రవాదానికి కేరాఫ్ అడ్రస్ అయిన పాకిస్తాన్ కు .. ప్రపంచవ్యాప్తంగా తన కుటిల వ్యూహాలకు పేరుగాంచిన చైనా.. ఈ రెండు దేశాల మధ్య రోజు రోజుకు పెరుగుతున్న స్నేహం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది. చైనా, పాక్ ల మధ్య బలపడుతున్న ఈ కూటమి భారత్ కు ఎలాంటి సవాళ్లను ముప్పును తెచ్చిపెట్టబోతోందనే విషయంపై అమెరికా పార్లమెంటరీ కమిటీ తాజాగా ఒక సంచలన రిపోర్టును వెలువరించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని విశ్లేషించినట్లయితే.. భారతదేశ భద్రతకు సంబంధించి అమెరికా కాంగ్రెస్ కమిటీ అత్యంత కీలకమైన.. ఆందోళన కలిగించే రిపోర్టును రిలీజ్ చేసింది. చైనా పాకిస్తాన్ మధ్య రోజు రోజుకు బలపడుతున్న సైనిక సహకారం కారణంగా.. భారత్ కు రెండు సరిహద్దుల్లో ఏకకాలంలో యుద్ధం ఎదుర్కొవల్సిన ముప్పు వేగంగా పెరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత్.. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు..వాయుసేన బేస్ల పై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చైనా తెర వెనుక నుంచి పాకిస్తాన్ కు మద్దతు తెలిపింది. అయితే దీని వెనక చాలా పెద్ద ప్లానే ఉందని అమెరికాకు చెందిన కీలక కమిషన్ రిపోర్టు ఈ విషయాన్ని వెల్లడించింది. అనేక రంగాల్లో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక అడ్డుకునేందుకు వేస్తున్న ఓ భారీ ప్రయత్నంగా దీన్ని అభివర్ణించింది. అమెరికా చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ 2026 వార్షిక నివేదికలో చైనాస్ అదర్ ఫ్రంట్..ఇండియా అండ్ ది ఫ్యూచర్ ఆఫ్ యూఎస్ స్ట్రాటజీ ఇన్ది ఇండో పసిఫిక్ (China's Other Front: India and the Future of US Strategy in the Indo-Pacific)పేరుతో ఒక పూర్తి చాప్టర్ ను రూపొందించారు.

భారత్ ఆర్థికంగా, సైనిక పరంగా ఎదగడం చూసి ఓర్వలేకే: 
భారత్ సైనికంగా, ఆర్థికంగా ఎదుగుతుండటం.. తమకు వ్యూహాత్మక సవాల్ గా మారుతుందని బీజింగ్ పరిగణిస్తోందని అమెరికా కమిషన్ రిపోర్టు నిర్దారించింది. ఈ నివేదిక ఫిబ్రవరి 2026 కమిషన్ విచారణలు, భారతదేశంలో వాస్తవ పరిశీలన పర్యటన, అధికారులు, వ్యాపారవేత్తలతో సమావేశాలు, ఇతర పరిశోధనల ఆధారంగా రూపొందించింది. ఆపరేషన్ సింధ్‌లో పాకిస్థాన్‌కు చైనా మద్దతు ఇవ్వడం అనేది, భారతదేశాన్ని సమతుల్యం చేయడానికి బీజింగ్ అనుసరిస్తున్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగమని ఈ నివేదిక పేర్కొంది. దీని మూలాలు 1962 నాటి చైనా-భారత యుద్ధం నాటివని పేర్కొంది. పాక్ కు చైనా నుంచే ఎక్కువగా ఆయుధాలు అందుతున్నాయని.. 2020-24 మధ్య కాలంలో పాకిస్తాను ఆయుధ దిగుమతుల్లో 81శాతం చైనా నుంచే ఉన్నాయని అమెరికా రిపోర్టు వెల్లడించింది. సరిహద్దుల్లో పాక్  యుద్దం చేయాల్సి వస్తే.. అదే సమయంతో చైనాతో యుద్ధం చేయాల్సి వస్తుందనే . భారత్ ఆందోళనను ఆపరేషన్ సింధూర్ మరింత పెంచిందని రిపోర్టు పేర్కొంది.

ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో చైనా నేరుగా యుద్ధంలోకి దిగకుండానే.. పాకిస్తాన్ కు ఎలా సపోర్టు చేస్తుందన్న విషయాన్ని ఆపరేషన్ సింధూర్ చాటిందని యూఎస్ కమిషన్ గుర్తించింది. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు చైనా మద్దతుగా నిలిచిన విషయాన్ని భారత్ ఇప్పటికే ఎత్తి చూపింది. భారత్, చైనా మధ్య దీర్ఘకాలికంగా సరిహద్దు వివాదం ఉన్నా.. ఇటీవలి కాలంలో ఈ రెండు దేశాల దౌత్య సంబంధాల్లో కొంతమేర సానుకూల మార్పు కనిపించిన సంగతి తెలిసిందే.

ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలను పాకిస్తాన్ వినియోగించిందని రిపోర్టులో పేర్కొంది. అయితే అదే సమయంలో భారత ప్రభుత్వానికి  చెందిన ఐటీ వ్యవస్థలు, టెలీకమ్యూనికేషన్లు, డిజిటల్ సర్వీసులను లక్ష్యంగా చేసుకుని హ్యాకర్లు భారీఎత్తున సైబర్ దాడులకు ప్రయత్నించారని పేర్కొంది. అయితే  ఈ దాడులు ఎక్కడ్నుంచి జరిగాయన్న విషయం కచ్చితంగా తెలియనిప్పటికీ.. వీటి మూలాలు మాత్రమ చైనాలో ఉన్నట్లు భారత-చైనా సైనిక వ్యవహారాల నిపుణులు సమీర్ లాల్వానీ ఇంచిన వాంగ్మూలాన్ని రిపోర్టు ఉటంకించింది.

ఇరు దేశాల మధ్య ఉద్రిత్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అత్యాధునిక సెన్సార్లతో కూడిన ఒక సర్వే నౌకను భారత తీర ప్రాంత సముద్ర జలాల్లోకి.. మరో నౌకను బంగాళాఖాతంలోకి డ్రాగన్ పంపించినట్లు రిపోర్టు పేర్కొంది. భారత సైనిక బలగాల కదలికలను గమనించి.. ఆ కీలక సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేసేందుకు చైనా ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చంటూ అభిప్రాయపడింది. అంతేకాదు ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాల ప్రతిష్టను దెబ్బకొట్టేందుకు అలాగే చైనా రూపొందించిన జే 10 ఫైటర్ జెట్ల కు ప్రచారం కల్పించేందుకు ఆన్ లైన్ వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిందని నివేదిక స్పష్టం చేసింది. 
 

సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, అరుణాచల్ ప్రదేశ్‌పై కుట్ర:
చైనా అనుసరిస్తున్న బహుళ రంగాల (మల్టిపుల్ డొమైన్స్) వ్యూహంలో పాకిస్థాన్ కేవలం ఒక భాగం మాత్రమేనని నివేదిక విశ్లేషించింది. భారత్‌తో ఉన్న 3,400 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా చైనా భారీగా మౌలిక సదుపాయాలు, ఎయిర్‌ఫీల్డ్‌లు, రైల్వే లైన్లు, లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లను విస్తరిస్తోందని తెలిపింది. దీనివల్ల భారత్ తన విలువైన వనరులను ఆర్థికాభివృద్ధి మరియు నౌకాదళ ఆధునికీకరణ నుంచి సరిహద్దు భద్రత వైపు మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని పేర్కొంది.

అంతేకాకుండా, తవాంగ్ సమీపంలో నిర్మాణాలు చేపట్టడం, అరుణాచల్ ప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు మాండరిన్ భాషలో పేర్లు పెట్టడం, ఆ రాష్ట్ర ప్రజలను భారత పౌరులుగా గుర్తించేందుకు నిరాకరించడం వంటి చర్యల ద్వారా అరుణాచల్ ప్రదేశ్ తమదేనన్న వాదనను చైనా బలంగా వినిపించే ప్రయత్నం చేస్తోందని నివేదిక వెల్లడించింది. మరోవైపు హిందూ మహాసముద్రంలో తమ నౌకాదళ ఉనికిని నిరంతరం కొనసాగించేందుకు జిబౌటి, గ్వాదర్, హంబన్‌టోట, చిట్టగాంగ్ పోర్టులతో పాటు లాజిస్టిక్స్ లింకులను చైనా వాడుకుంటోందని కమిషన్ వివరించింది.

పాక్‌కు నిఘా సమాచారం.. చైనా ఇంజినీర్ ధ్రువీకరణ:
ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్థాన్‌కు చైనా నుంచి రియల్ టైమ్ ఉపగ్రహ ఛాయాచిత్రాలు, ఇతర నిఘా సమాచారం అంది ఉండవచ్చని భారత సైన్యం అనుమానం వ్యక్తం చేసినప్పుడు.. చైనా విదేశాంగ శాఖ దానిని ధ్రువీకరించలేదు, అలాగని ఖండించనూ లేదు. అయితే చైనా-పాకిస్థాన్ భద్రతా సంబంధాలు ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఏర్పడినవి కావని, అవి సాధారణ సహకారం మాత్రమేనని భారత్‌లోని చైనా రాయబారి జు ఫీహాంగ్ పేర్కొన్నట్లు ‘ది హిందూ’ గతంలో ప్రచురించింది. కానీ 2026 మే నెలలో చైనా ప్రభుత్వ మీడియా సంస్థ సీసీటీవీ, చెంగ్డు ఎయిర్‌క్రాఫ్ట్ డిజైన్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇంజినీర్ ఝాంగ్ హెంగ్‌తో నిర్వహించిన ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. భారత్-పాక్ ఘర్షణల సమయంలో పాకిస్థాన్‌కు క్షేత్ర స్థాయి సాంకేతిక సమాచారాన్ని అందించినట్లు ఆయన ఆ ఇంటర్వ్యూలో ధ్రువీకరించారు.

ఆర్థిక ఒత్తిడి ఆయుధంగా చైనా ఎత్తుగడలు:
భారత పొరుగు దేశాలను తన వైపునకు తిప్పుకోవడానికి ప్రయత్నించడంతో పాటు, ఆర్థిక ఒత్తిడిని ఒక ఆయుధంగా చైనా ఉపయోగిస్తోందని కమిషన్ తెలిపింది. ఇందులో భాగంగా ఎరువులు, టన్నెల్ బోరింగ్ యంత్రాల ఎగుమతులపై ఆంక్షలు విధించడం, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనుమతులను జాప్యం చేయడం, భారత్‌లోని ఫాక్స్‌కాన్ కర్మాగారానికి రావాల్సిన ఇంజినీర్లు మరియు పరికరాలపై నియంత్రణలు పెట్టడం వంటి చర్యలకు చైనా పాల్పడిందని పేర్కొంది. 2025 ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ బీజింగ్ పర్యటనకు ముందు ఎరువులు, టన్నెల్ బోరింగ్ మెషీన్లు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్‌పై ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ.. బ్యాటరీ టెక్నాలజీ బదిలీకి చైనా పెడుతున్న అడ్డంకులు మాత్రం భారత్‌ను ఇబ్బంది పెట్టేలాగే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.

భారత్ ప్రతివ్యూహం.. అమెరికాకు కమిషన్ సూచనలు:
చైనా దూకుడును ఎదుర్కొనేందుకు భారత్ కూడా తన వ్యూహాలను మార్చుకుంటోందని అమెరికా నివేదిక ప్రస్తావించింది. భారత్ తన రక్షణ ప్రణాళికలను చైనా వైపు మళ్లించిందని, సరిహద్దుల్లో వేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తోందని తెలిపింది. దీంతో పాటు నౌకాదళ సామర్థ్యం, సైబర్ సెక్యూరిటీ, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోందని వివరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం భారత్‌తో కేవలం సైనిక విన్యాసాలకే పరిమితం కాకుండా, నిరంతర వ్యూహాత్మక సహకారం దిశగా అడుగులు వేయాలని ఆ నివేదిక సూచించింది. నిఘా, పర్యవేక్షణ, సమాచార మార్పిడితో పాటు హిందూ మహాసముద్రంలో చైనా నౌకాదళ, జలాంతర్గామి కార్యకలాపాలను సమన్వయంతో పర్యవేక్షించడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషన్ సూచించిది.  

Add Zee News as a Preferred Source
TAGS:
PM Modi
America
Pakistan